Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

59 బంతుల్లో 133 రన్స్: డెవిలియర్స్ గురించి క్రికెటర్లు ఏమన్నారు..?

బెంగుళూరు: 'ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్' ఎవరూ అంటే అటు మాజీలు, ఇటు ప్రస్తుత క్రికెట్ ఆటగాళ్లు నోటి నుంచి ఠక్కువ వచ్చిన సమాధానం రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు బ్యాట్స్‌మెన్ ఏబీ డెవిలియర్స్.

ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నమెంట్‌లో దక్షిణాఫ్రికాకు చెందిన ఏబీ డెవిలియర్స్ ఎలాంటి బౌలింగ్ ఎటాక్‌నైనా అవలీలగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నాడు. ముంబై ఇండియన్స్‌పై మే 10(ఆదివారం)న జరిగిన మ్యాచ్‌లో 59 బంతుల్లో 133 పరుగులు చేసిన ఏబీ డెవిలియర్స్‌పై క్రికెటర్లు ప్రశంసలతో ముంచెత్తారు.

ఆరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు 20 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 235 పరుగులు చేసింది. ఏబీ డెవిలియర్స్ సాధించిన ఈ సెంచరీ ఐపీఎల్‌లోనే అత్యుత్తమ సెంచరీల్లో ఒకటిగా నిలిచింది. తుది దశకు చేరుకున్న ఐపీఎల్ టోర్నమెంట్‌లో ఏబీ డెవిలియర్స్ గురించి మిగతా క్రికెటర్లు చెప్పిన కోట్స్ పాఠకుల కోసం ప్రత్యేకం.

IPL 2015: 'Best' and 'incredible' quotes from cricketers on AB de Villiers

విరాట్ కోహ్లీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు కెప్టెన్)
"ఏబీ డెవిలియర్స్‌తో ఆడటం ఎంతో సంతోషంగా ఉంటుంది. అతను ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడు"


క్రిస్ గేల్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు)

"ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ ఆటగాళ్లలో ఏబీ డెవిలియర్స్ ఒకడు. అతనితో కలిసి ఆడటం ఎంతో సంతోషంగా ఉంటుంది."


డేవిడ్ వార్నర్ (సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్)

"ఏబీ డెవిలియర్స్ లాంటి కేటగిరికి చెందిన వాడను కాను. అతను ఏమి తింటాడో మనం కూడా అదే తినాలి. అతని ఆట అలాగ ఉంటుంది. అదో భయంకరమైన క్రికెట్."


IPL 2015: 'Best' and 'incredible' quotes from cricketers on AB de Villiers

బ్రెండన్ మెక్‌కల్లమ్ (చెన్నై సూపర్ కింగ్స్)

"నేను చూసిన సెంచరీల్లో ఇదొకటి. మూడు ఫార్మెట్లలోనూ ఏబీ డెవిలియర్స్ ఆట మరోలా ఉంటుంది. అతని ఆట అందరూ ప్రశంసించే విధంగా ఉంటుంది. అతనో మంచి క్రికెటరే కాదు, ఓ లెజెండ్. వికెట్ చుట్టూ అతని బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది చాలా అద్భుతం."


ఇర్ఫాన్ పఠాన్ (చెన్నై సూపర్ కింగ్స్)

"ఏబీ డెవిలియర్‌పై ఒక బౌలర్‌గా నేనో అధికారిక ఫిర్యాదు చేస్తున్నా. బౌలర్లందరూ నాతో కలిసిరండి."


మహిళా జయవర్దేనే (శ్రీలంక మాజీ కెప్టెన్)

"ఎంత మంచిగా ఆడుతున్నాడో ఏబీ డెవిలియర్స్. ఇది క్లాస్"


అజిత్ అగార్కర్ (టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్)

"ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్"


రస్సెల్ ఆర్నార్డ్ (శ్రీలంక మాజీ ఆల్ రౌండర్)

"ఏబీ డెవిలియర్స్ ఛాంపియన్. అమలు చేయడంలో అద్భుతమైన నైపుణ్యం"


మైఖెల్ వాన్ (ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్)

"ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడు"

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+