For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ముంబై ఇండియన్స్ విజయానికి కారణం చెప్పిన చెన్నై కెప్టెన్ ధోని

IPL 2019 Final : MS Dhoni Reveals Reasons For Loss In IPL Final vs MI || Oneindia Telugu
IPL 20019, CSK vs MI: We were passing the trophy to each other says MS Dhoni

ఫైనల్‌ మ్యాచ్‌లో పొరపాట్లు సహజమే. అయితే మాకంటే ముంబై ఇండియన్స్‌ తక్కువ పొరపాట్లు చేయడంతో విజయం సాధించింది అని చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ తెలిపాడు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌ ఉప్పల్ మైదానంలో జరిగిన ఐపీఎల్‌-12 ఫైనల్‌లో ముంబై ఇండియన్స్‌ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించి నాలుగోసారి టైటిల్‌ కైవసం చేసుకుంది. నాలుగోసారి టైటిల్‌ సాధించి ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా నిలిచింది.

కొంత నిరాశపరిచింది:

కొంత నిరాశపరిచింది:

ఈ మ్యాచ్‌ అనంతరం చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ధోనీ మాట్లాడుతూ... 'ఒక జట్టుగా మేము సీజన్‌లో మంచి క్రికెట్ ఆడాం. ఫైనల్ చేరుకోవడానికి చాలా కష్టపడ్డాం. గతంలో కూడా ఫైనల్ చేరుకున్నా.. ఈ సారి కొంత నిరాశపరిచింది. మొదటి సీజన్ నుంచి కూడా మేము మంచి క్రికెట్ ఆడుతున్నాం' అని ధోనీ అన్నారు.

విజయానికి వారు అర్హులు:

విజయానికి వారు అర్హులు:

'మా మిడిల్‌ ఆర్డర్‌ బాగాలేదు. ఈ రోజు ఎంతో సరదాగా మ్యాచ్ సాగింది. ట్రోఫీని ముంబై, చెన్నై ఒకరి నుంచి ఒకరం మార్చుకుంటున్నాం. ఫైనల్‌ మ్యాచ్‌లలో పొరపాట్లు సహజమే. అయితే తక్కువ పొరపాట్లు చేసిన జట్టే విజయం సాధిస్తుంది. ఈ రోజు ముంబై అదే చేసి విజయం సాధించింది. ఈ విజయానికి వారు పూర్తి అర్హులు' అని ధోనీ పేర్కొన్నారు.

ప్రపంచకప్‌ అనంతరం దృష్టి పెడతాం:

ప్రపంచకప్‌ అనంతరం దృష్టి పెడతాం:

'మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ వేశారు. ఈ పిచ్‌పై 150 పరుగులకంటే ఎక్కువ చేయొచ్చు. అయినా మా బౌలర్లు ప్రత్యర్థిని కట్టడి చేశారు. వికెట్‌ అవసరమైన ప్రతీసారి బౌలర్లు వికెట్లు తీశారు. తక్కువ పరుగులు చేదించేటప్పుడు ఇన్నింగ్స్ ఆరంభంలో ఒక బ్యాట్స్‌మన్‌ బాగా ఆడాలి. గత మ్యాచ్‌లలో ఇదే చేసాం. కానీ ఈ సారి అలా కుదరలేదు. మిడిల్‌ ఆర్డర్‌లో కొంచెం విఫలమైంది. ప్రపంచకప్‌ అనంతరం వీటన్నింటిపై దృష్టి పెడతాం' అని ధోనీ చెప్పుకొచ్చారు.

చెన్నై ఓటమి:

చెన్నై ఓటమి:

ఉప్పల్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్‌లో చెన్నై ఒక పరుగు తేడాతో ఓడిపోయింది. చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 148 పరుగులు చేసింది. ఓపెనర్ షేన్‌ వాట్సన్‌ (59 బంతుల్లో 80; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించినా జట్టును గెలిపించలేకపోయాడు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. కీరన్‌ పొలార్డ్‌ (25 బంతుల్లో 41 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), డికాక్‌ (17 బంతుల్లో 29; 4 సిక్సర్లు) రాణించారు.

Story first published: Monday, May 13, 2019, 11:35 [IST]
Other articles published on May 13, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+