సొంతగడ్డపై ముంబై సెలబ్రేషన్స్.. భారీగా తరలివచ్చిన అభిమానులు

ఆదివారం హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా జరిగిన ఐపీఎల్-12 ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై ముంబయి ఇండియన్స్ అద్భుత విజయం సాధించింది. ఆఖరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఒక్క పరుగు తేడాతో విజయాన్ని అందుకుని నాలుగోసారి ఐపీఎల్ ట్రోఫీ సాధించింది. మ్యాచ్ అనంతరం ఆటగాళ్లు అందరూ స్టేడియంలోనే సెలబ్రేషన్స్ చేసుకున్నారు.
విజయోత్సవ ర్యాలీ:
ఐపీఎల్ ట్రోఫీ సాధించిన ముంబై ఇండియన్స్ ఇంకా సంబరాల్లో మునిగి తేలుతోంది. మ్యాచ్ అనంతరం హైదరాబాద్‌లో విజయోత్సవ సంబరాలు జరుపుకొన్న ముంబై ఆటగాళ్లు.. సోమవారం రాత్రి సొంతగడ్డ ముంబైలో అడుగుపెట్టారు. ముంబై యాజమ్యానం జట్టులోని ఆటగాళ్లను ఓపెన్ టాప్ బస్సులో ఊరేగించింది. ఆటగాళ్లందరూ బస్సు టాప్‌పై నిల్చొని అభిమానులకు అభివాదం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయోత్సవ ర్యాలీని చూడడానికి ముంబై అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
నాలుగు ట్రోఫీలతో రోహిత్:
ముంబై జట్టు ఆటగాళ్లు అందరూ ఐపీఎల్ ట్రోఫీతో ఫొటోలు దిగారు. కెప్టెన్ రోహిత్ శర్మ నాలుగు ట్రోఫీలతో కలిసి ఫొటో దిగి తన ఆనందాన్ని వ్యక్తం చేసాడు. ముంబై ప్రధాన కోచ్ మహేళ జయవర్ధనే ప్రత్యేక ఫొటో దిగాడు. ఇక యజమాని నీతా అంబానీ ట్రోఫీని తన ఇంట్లోని పూజ గదిలో ఉంచగా.. అర్చకులు మంత్రాలు చదివారు. వీటికి సంబందించిన పోటోలను ముంబై తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఉంచింది. ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.

ముంబై విజయం:
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. కీరన్ పొలార్డ్ (25 బంతుల్లో 41 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), డికాక్ (17 బంతుల్లో 29; 4 సిక్సర్లు) రాణించారు. ఛేదనలో చెన్నై ఒక పరుగు తేడాతో ఓడిపోయింది. చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 148 పరుగులు చేసింది. ఓపెనర్ షేన్ వాట్సన్ (59 బంతుల్లో 80; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించినా.. జట్టును గెలిపించలేకపోయాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications