నీతా పూజలు.. ముంబై విజయం వెనుక బల్కంపేట అమ్మవారు

ఆదివారం రాత్రి ఉప్పల్ వేదికగా జరిగిన ఐపీఎల్ 12వ సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌పై ఒక్క పరుగు తేడాతో విజయం సాధించి కప్ ఎగరేసుకుపోయింది. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా నాలుగోసారి కప్ గెలిచిన జట్టుగా ముంబై అవతరించింది. అయితే ఓడాల్సిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ అనూహ్యంగా విజయం సాధించింది. దీనికి అసలు కారణం ముంబై జట్టు జయమాని నీతా అంబానీ పూజలే అని అభిమానులు సరదాగా ట్వీట్ చేస్తున్నారు.

మ్యాచ్ మధ్యలోనే స్టేడియం బయటకు:
విషయంలోకి వెళితే... ఆదివారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ చూసేందుకు ముంబై నుండి ఆ జట్టు యజమాని నీతా అంబానీ ఆదివారం సాయంత్రమే హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం మ్యాచ్ జరుగుతున్న ఉప్పల్ స్టేడియంకు వెళ్లారు. కొద్దిసేపు మ్యాచ్‌ను చూసిన నీతా .. ఆట మధ్యలోనే స్టేడియం నుండి బయటకు వచ్చారు.
బల్కంపేట ఎల్లమ్మ గుడికి:
సుమారు రాత్రి 9.10 గంటల సమయంలో బల్కంపేటలోని ఎల్లమ్మ గుడికి చేరుకున్నారు. ఆలయ ఈఓ, అర్చకులు ఆమెకు స్వాగతం పలికి గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై అమ్మవారి శేషవస్త్రంతో నీతా అంబానీని సన్మానించారు. అనంతరం ప్రధాన అర్చకులు ఆమెకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. గుడి ఆవరణలో ఉన్న పోచమ్మ, నాగదేవతలను కూడా నీతా దర్శించుకున్నారు. చివరగా హండీలో కానుకలు సమర్పించుకున్నారు.

మ్యాచ్ ఆసాంతం పూజలు:
అనంతరం నీతా అంబానీ తిరిగి స్టేడియానికి చేరుకున్నారు. ఉత్కంఠంగా సాగుతున్న మ్యాచ్ ఆసాంతం ఆమె పూజలు చేసింది. ఇక వాట్సన్ వరుసగా మూడు సిక్సులు బాదిన సమయంలో, ధోనీ రనౌట్ సమయంలో, చివరి బంతి సమయంలో కూడా మంత్రాలు చదువుతూ కనిపించింది. చివరకు మలింగ మాయతో ముంబై ఒక పరుగు తేడాతో గెలిచింది. వెంటనే నీతా మైదానంలోకి వచ్చి ముంబై ఆటగాల్లతో సంబరాలు చేసుకుంది.

పూజలే ముంబై జట్టును గెలిపించాయి:
ప్రస్తుతం నీతా అంబానీ పూజలకు సంబందించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తున్నాయి. వీటికి క్రికెట్ అభిమానులు సరదాగా కామెంట్లు పెడుతున్నారు. 'నీతా అంబానీ పూజలే ముంబై జట్టును గెలిపించాయి' అని ఓ అభిమాని ట్వీట్ చేయగా.. 'ముంబై విజయం వెనుక బల్కంపేట అమ్మవారు ఉన్నారు' అని మరో అభిమాని ట్వీట్ చేసాడు. 'దేవుడిని బాగా నమ్ముతుంది', 'ఈ రోజు అసలు పూజల ఫలితం చూసాను', 'కచ్చితంగా నీతా ప్రపంచకప్ జట్టుతో వెళ్ళాలి' అని ట్వీట్లు చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications