For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ ఫైనల్లో ధోనీ రనౌట్‌.. 110% ఇది ఫిక్సింగ్ మ్యాచ్

IPL 2019 Final : MS Dhoni's Dramatic Run Out Causes Stir On Twitter | Oneindia Telugu
IPL 20019, CSK vs MI: MS Dhonis Dramatic Run Out Causes Stir On Twitter, CSK Fans fire

హైదరాబాద్ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో చెన్నై సూపర్‌కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ జట్ల మధ్య ఆదివారం జరిగిన ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. చివరి బంతి వరకు కొనసాగిన ఈ థ్రిల్లర్‌ మ్యాచ్‌లో కేవలం ఒకే పరుగు తేడాతో ముంబై విజేతగా నిలిచింది. ముఖ్యంగా చెన్నై కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ అనూహ్యంగా రనౌట్‌ అవ్వడం చెన్నై విజయంపై తీవ్ర ప్రభావం చూపింది. అసలు ధోనీ రనౌట్‌ అయ్యాడా? లేదా? అని ఇప్పటికీ అర్ధం కావడం లేదు.

మరో రన్‌ కోసం ప్రయత్నిస్తూ.. :

మరో రన్‌ కోసం ప్రయత్నిస్తూ.. :

అసలు ఏమైందంటే.. హార్దిక్‌ వేసిన 13వ ఓవర్‌ నాలుగో బంతిని వాట్సన్‌ షాట్ ఆడగా ధోనీ సింగిల్‌ పూర్తి చేశాడు. అయితే మలింగ ఓవర్‌త్రో కారణంగా మరో రన్‌ కోసం ప్రయత్నిస్తూ ధోనీ నాన్‌స్ట్రయిక్‌ ఎండ్‌ వైపు పరుగెత్తుతున్నాడు. ఇదే సమయంలో బంతిని అందుకున్న ఇషాన్‌ కిషన్‌ నేరుగా వికెట్లకు విసిరాడు. దీంతో గ్రౌండ్‌ అంపైర్‌.. థర్డ్‌ అంపైర్‌ సహాయం కోరాడు. థర్డ్‌ అంపైర్‌ నిగేల్‌ లాంగ్ వివిధ యాంగిల్‌లలో విశ్లేషణ జరిపేందుకు చాలా సమయం తీసుకున్నాడు.

ధోనీ అవుట్‌:

ఓ యాంగిల్‌లో ధోనీ బ్యాట్‌ ఆన్‌లైన్‌ ఉన్నట్టు కనిపించగా.. మరో యాంగిల్‌లో అంగుళం తేడాతో బయట ఉన్నట్టు రీప్లేలో కనిపించింది. దీంతో చాలా సమయం తీసుకున్న థర్డ్‌ అంపైర్‌.. చివరకు ధోనీని అవుట్‌గా ప్రకటించాడు. ధోనీని ఔట్‌ అని ప్రకటించడంతో చెన్నై అభిమానులు నిరాశకు లోనయ్యారు. చివరలో వాట్సన్‌ కూడా పెవిలియన్ చేరడంతో ముంబై మ్యాచ్ సొంతంచేసుకుంది.

110% ఫిక్సింగ్ మ్యాచ్:

కీలక సమయంలో చెన్నై కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీని రనౌట్‌గా ప్రకటించడంతో ట్విట్టర్ వేదికగా చెన్నై అభిమానులు మండిపడుతున్నారు. 'చెన్నై, ముంబై మ్యాచ్ 110% ఫిక్సింగ్. వాట్సన్‌ అవుట్ అనంతరం హర్భజన్ ను పంపకుండా ఠాకూర్ ను ఎందుకు పంపారు. ఎవరు బెస్ట్ బ్యాట్స్‌మన్‌' అని ఓ అభిమాని మండిపడ్డాడు.

 ఇది ఐపీఎల్ కాదు:

ఇది ఐపీఎల్ కాదు:

'థర్డ్‌ అంపైర్‌ వైఫల్యం మరోసారి బయటపడింది. థర్డ్‌ అంపైర్‌ డబ్బు కోసం చాలా సమయం తీసుకున్నాడు. ఇది ఐపీఎల్ కాదు. ఈ లీగ్ డబ్బు కోసం నడుస్తుంది' అని మరో అభిమాని ట్వీటాడు. ఇలా చాలా మంది అభిమానులు తమ కోపాన్ని తెలిపారు.

Story first published: Monday, May 13, 2019, 13:46 [IST]
Other articles published on May 13, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+