Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీ ఆటగాడు మాత్రమే కాదు.. ధోనీది ఒక శకం

IPL 20019, CSK vs MI: MS Dhoni is not just a player, he is an era of cricket says Matthew Hayden

టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ధోనీ ఆటగాడు మాత్రమే కాదు.. క్రికెట్‌లో ధోనీది ఒక శకం అని హేడెన్ పేర్కొన్నారు. ఆదివారం ముంబైతో ఐపీఎల్-12 ఫైనల్ మ్యాచ్‌కు ముందు 'ద సూపర్ కింగ్స్ షో' పేరిట ఓ కార్యక్రమం నిర్వహించారు.

క్రికెట్‌లో ధోనీది ఒక శకం:

క్రికెట్‌లో ధోనీది ఒక శకం:

ఈ సందర్భంగా మాథ్యూ హేడెన్ మాట్లాడుతూ... 'మీకు తెలుసా!! ధోనీ ఆటగాడు మాత్రమే కాదు.. క్రికెట్‌లో ధోనీది ఒక శకం. ఎన్ని విధాలుగా ఆలోచించినా.. గల్లీ క్రికెట్ జట్టుకు ఎంఎస్ ఒక కెప్టెన్‌గా వ్యవహరించినట్లు ఉంటుంది. అతను మాలో ఒకడు. జట్టులో ఒక సభ్యుడుగా అందరితో బాగుంటాడు. అతను ఏదైనా చేయగలడు' అని హేడెన్ పేర్కొన్నాడు.

 తలా పేరుకి అర్హుడు:

తలా పేరుకి అర్హుడు:

'మ్యాచ్ కోసం అతను సన్నద్ధమయ్యే తీరు బాగుంటుంది. బౌలర్లకు స్వేచ్ఛనిస్తాడు. బౌలర్లకు ఏం కావాలో అడుగుతాడు. బౌలింగ్‌కు తగ్గట్లు ముందే ఫీల్డింగ్ సెట్ చేస్తాడు. ఆటగాళ్ల నుంచి తనకు కావాల్సిన దాన్ని రాబట్టుకుంటాడు. ఓ భాద్యతగా పనిచేయడం అతనికే సాధ్యం. తలా అనే పేరుకి అర్హుడు' అని హేడెన్ తెలిపారు. హేడెన్ ఇంతకుముందు చెన్నైకి ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే.

చెన్నై ఓటమి:

చెన్నై ఓటమి:

ఉప్పల్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్‌లో చెన్నై ఒక పరుగు తేడాతో ఓడిపోయింది. చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 148 పరుగులు చేసింది. ఓపెనర్ షేన్‌ వాట్సన్‌ (59 బంతుల్లో 80; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించినా జట్టును గెలిపించలేకపోయాడు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. కీరన్‌ పొలార్డ్‌ (25 బంతుల్లో 41 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), డికాక్‌ (17 బంతుల్లో 29; 4 సిక్సర్లు) రాణించారు.

Story first published: Monday, May 13, 2019, 11:36 [IST]
Other articles published on May 13, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+