For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ ఫైనల్.. రక్తమోడుతున్నా బ్యాటింగ్ చేసాడు

IPL 2019 Final : Watson Injured His Knee In IPL Final But Told No One & Played On ! || Oneindia
IPL 20019, CSK vs MI: Harbhajan Singh reveals how Shane Watson batted through bloodied leg

ఆదివారం రాత్రి ఉప్పల్ వేదికగా జరిగిన ఐపీఎల్‌-12 ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ముంబయి ఇండియన్స్‌ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. ఆఖరి బంతి వరకూ ఈ మ్యాచ్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. ఆ మ్యాచ్‌లో చెన్నై ఓడి నా.. ఆ జట్టు ఓపెనర్, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు షేన్‌ వాట్సన్‌ చేసిన పోరాటం అందరినీ ఆకట్టుకుంది. జట్టును గెలిపించడానికి రక్తం కారుతున్నా కూడా వాట్సన్‌ బ్యాటింగ్‌ కొనసాగించాడట.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

గాయాన్ని లెక్క చేయకుండా:

గాయాన్ని లెక్క చేయకుండా:

ఫైనల్ మ్యాచ్ మధ్య ఓవర్లలో డైవ్‌ చేసే క్రమంలో వాట్సన్‌ మోకాలికి గాయమైంది. మ్యాచ్‌ రసవత్తరంగా సాగుతుండడంతో.. ఎవరూ దీనిని పట్టించుకోలేకపోయారు. వాట్సన్‌ సైతం తన గాయాన్ని లెక్క చేయకుండా చెన్నై విజయానికి తన శాయశక్తులా కృషి చేసాడు. వరుస సిక్సులు బాది మ్యాచ్‌ను చెన్నై వైపు తిప్పాడు. అయితే చివరకు అనూహ్య రనౌట్ ద్వారా పెవిలియన్ చేరాడు. చివరి బంతికి ఠాకూర్ కూడా అవుట్ అవ్వడంతో చెన్నై ఓటమిని చవిచూసింది.

రక్తాన్ని చూశారా?:

రక్తాన్ని చూశారా?:

వాట్సన్‌ గాయానికి సంబంధించి చెన్నై యాజమాన్యం ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. కానీ .. చెన్నై స్పిన్నర్ హర్భజన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విషయాన్ని తెలిపాడు. వాట్సన్‌ ఎడమ మోకాలి వద్ద రక్తం కారుతున్న ఫొటోను కూడా పోస్టు చేశాడు. 'అతడి మోకాలి వద్ద కారుతున్న రక్తాన్ని చూశారా?. మ్యాచ్‌ అనంతరం వాట్సన్‌కు ఆరు కుట్లు పడ్డాయి. డైవింగ్‌ చేసినప్పుడు గాయపడినా.. ఎవరికీ చెప్పకుండా బ్యాటింగ్‌ను కొనసాగించాడు' అని భజ్జీ రాశాడు.

వాట్సన్‌ పోరాడినా...:

వాట్సన్‌ పోరాడినా...:

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. కీరన్‌ పొలార్డ్‌ (25 బంతుల్లో 41 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), డికాక్‌ (17 బంతుల్లో 29; 4 సిక్సర్లు) రాణించారు. లక్ష్య ఛేదనలో చెన్నై కేవలం ఒక పరుగు తేడాతో ఓడిపోయింది. చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 148 పరుగులు చేసింది. ఓపెనర్ షేన్‌ వాట్సన్‌ (59 బంతుల్లో 80; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించినా.. జట్టును గెలిపించలేకపోయాడు.

Story first published: Tuesday, May 14, 2019, 14:58 [IST]
Other articles published on May 14, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+