Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కాకతీయ హోటల్‌పై హర్భజన్‌ అసంతృప్తి.. ఫన్నీగా నెటిజన్ల కామెంట్లు

IPL 2019 : Harbhajan Singh Slams ITC Hotel Service In Hyderabad || Oneindia Telugu
IPL 20019, CSK vs MI: Harbhajan Singh miffed with team hotel ahead of MI vs CSK

చెన్నై సూపర్‌కింగ్స్‌ సీనియర్ ఆఫ్ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ హైదరాబాద్‌లోని ఐటీసీ కాకతీయ హోటల్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐపీఎల్‌-12 ఫైనల్‌ మ్యాచ్‌ కోసం చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు హైదరాబాద్‌లోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో బస చేసింది. హోటల్‌లోని ఆహారం‌, రూమ్‌ సర్వీస్‌ బాగోలేదని హర్భజన్‌ ట్విటర్‌ వేదికగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. తమను పట్టించుకునే సమయం కూడా హోటల్‌ సిబ్బందికి లేదంటూ మండిపడ్డారు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

నేను ఇతర నగరాల్లో కూడా ఐటీసీ హోటల్‌లో ఉండడానికి ఇష్టపడతాను. కానీ హైదరాబాద్‌లోని ఐటీసీ హోటల్‌లో ఉండడానికి ఇష్టపడను. ఆహారం‌ సరైన పద్దతిలో చేస్తున్నారా?. రూమ్‌ సర్వీస్‌ కూడా బాగాలేదు. కాల్ చేస్తే తమను పట్టించుకునే వారు కూడా లేరు' అని ట్విటర్ వేదికగా మండిపడ్డారు.

హర్భజన్‌ ట్వీట్‌పై స్పందించిన ఐటీసీ క్షమాపణలు చెప్పింది. వీలైనంత త్వరగా మెరుగైన సేవలు అందిస్తామని రి ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం హర్భజన్‌ ట్వీట్‌ నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. నెటిజన్లు తమదైన స్టయిల్లో కామెంట్లు పెడుతున్నారు. 'ఆన్‌లైన్‌లో ప్యారడైజ్‌ బిర్యానీ ఆర్డర్‌ చేసుకో' అని ఓ అభిమాని ట్వీటాడు. 'ఫుడ్‌ బాగోలేకపోతే ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసుకోవచ్చుగా' అని మరో అభిమాని ట్వీట్ చేసాడు.

Story first published: Monday, May 13, 2019, 13:28 [IST]
Other articles published on May 13, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+