Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్‌లో అత్య‌ధిక సార్లు 70+ స్కోర్లు చేసిందెవ‌రో తెలుసా? టాప్ 8లో ఉన్న‌ది వీరే..

IPL 15: List of cricketers scored 70+ runs the most times in the IPL

మ‌రో 5 రోజుల్లో ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2022 ప్రారంభం కాబోతుంది. దీంతో క్రికెట్ అభిమానులు ఆతుర‌త‌గా ఎదురుచూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన రికార్డుల గురించి క్రికెట్ అభిమానులు చ‌ర్చించుకుంటున్నారు. అయితే ఐపీఎల్‌లో బ్యాట‌ర్లు ప్రతి సీజ‌న్లో అనేక రికార్డుల‌ను సృష్టిస్తుంటారు. ఇలా ఇప్ప‌టివ‌ర‌కు అత్య‌ధిక సార్లు 70+ స్కోర్లు చేసిన బ్యాట‌ర్లు ఎవ‌ర‌నేది ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

క్రిస్ గేల్ టాప్‌

క్రిస్ గేల్ టాప్‌

ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు అత్య‌ధిక సార్లు 70+ స్కోర్లు సాధించిన బ్యాట‌ర్ల జాబితాలో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ మొద‌టి స్థానంలో ఉన్నాడు. గేల్ ఇప్ప‌టివ‌ర‌కు 26 సార్లు 70 పైగా స్కోర్లు సాధించాడు. ఐపీఎల్‌లో అత్యంత విజ‌య‌వంత‌మైన బ్యాట‌ర్ అయిన గేల్ ఇప్ప‌టివ‌ర‌కు 175 మ్యాచ్‌లాడి 39 స‌గ‌టుతో 4965 ప‌రుగులు చేశాడు. ఇందులో 6 సెంచ‌రీలు, 31 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి.

అత్య‌ధిక స్కోర్ 175 ప‌రుగులుగా ఉంది. ఇక ఈ జాబితాలో రెండో స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు. కోహ్లీ ఇప్ప‌టివ‌ర‌కు 22 సార్లు 70కి పైగా ప‌రుగులు చేశాడు. మొత్తంగా ఐపీఎల్‌లో 207 మ్యాచ్‌లాడిన కోహ్లీ 37 స‌గ‌టుతో 6283 ప‌రుగులు చేశాడు. ఇందులో 42 హాఫ్ సెంచ‌రీలు, 5 సెంచ‌రీలు ఉన్నాయి.

వార్న‌ర్, డివిల్లియ‌ర్స్ ఎన్ని సార్లంటే..

వార్న‌ర్, డివిల్లియ‌ర్స్ ఎన్ని సార్లంటే..

అత్య‌ధిక సార్లు 70+ స్కోర్లు సాధించిన ఆట‌గాళ్ల జాబితాలో ఆస్ట్రేలియా డ్యాషింగ్ ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ మూడో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో వార్న‌ర్ ఇప్ప‌టివ‌ర‌కు 21 సార్లు 70+ స్కోర్లు సాధించాడు. ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 150 మ్యాచ్‌లాడిన వార్న‌ర్ 41 స‌గ‌టుతో 5449 ప‌రుగులు చేశాడు.

ఇందులో 50 హాఫ్ సెంచ‌రీలు, 4 సెంచ‌రీలు ఉన్నాయి. ఇక నాల్గో స్థానంలో సౌతాఫ్రికా ఆట‌గాడు ఏబీ డివిల్లియ‌ర్స్ ఉన్నాడు. డివిల్లియ‌ర్స్ 17 సార్లు 70కి పైగా ప‌రుగులు చేశాడు. ఐపీఎల్‌లో 184 మ్యాచ్‌లాడిన డివిల్లియ‌ర్స్ 39 స‌గ‌టుతో 5162 ప‌రుగులు చేశాడు. ఇందులో 40 హాఫ్ సెంచ‌రీలు, 3 సెంచ‌రీలు ఉన్నాయి.

ధావ‌న్, వాట్స‌న్ ర్యాంకు ఎంత‌?

ధావ‌న్, వాట్స‌న్ ర్యాంకు ఎంత‌?

టీమిండియా వెట‌ర‌న్ ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ సైతం 17 సార్లు 70కి పైగా స్కోర్ల‌తో ఐదో స్థానంలో ఉన్నాడు. 192 మ్యాచ్‌లాడిన ధావ‌న్ 34 స‌గ‌టుతో 5783 ప‌రుగులు చేశాడు. ఇందులో 44 హాఫ్ సెంచ‌రీలు, 2 సెంచ‌రీలు ఉన్నాయి. ఇక 15 సార్లు 70కి పైగా స్కోర్లు సాధించి ఆస్ట్రేలియా ఆల్‌రౌండ‌ర్ షేన్ వాట్స‌న్ ఆరో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో 145 మ్యాచ్‌లాడిన వాట్స‌న్ 30 స‌గ‌టుతో 3874 ప‌రుగులు చేశాడు. ఇందులో 21 హాఫ్ సెంచ‌రీలు, 4 సెంచ‌రీలు ఉన్నాయి. అదే స‌మ‌యంలో 92 వికెట్లు కూడా తీశాడు.

రోహిత్, రాహుల్ ఎన్ని సార్లంటే..

ఈ జాబితాలో కేఎల్ రాహుల్ 14 సార్లు 70కి పైగా ప‌రుగులు చేసి ఏడో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 94 మ్యాచ్‌లాడిన రాహుల్ 47 స‌గటుతో 3273 ప‌రుగులు చేశాడు. ఇందులో 2 సెంచ‌రీలు, 27 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ కూడా 14 సార్లు 70+ స్కోర్లు చేసి ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో 213 మ్యాచ్‌లాడిన రోహిత్ శ‌ర్మ 31 స‌గ‌టుతో 5611 ప‌రుగులు చేశాడు. ఇందులో 40 హాఫ్ సెంచ‌రీలు, ఒక సెంచ‌రీ ఉన్నాయి.

Story first published: Sunday, March 20, 2022, 16:42 [IST]
Other articles published on Mar 20, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+