Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

షెడ్యూల్ ఖరారు: ఏప్రిల్ 7న ముంబైలో, ఐపీఎల్ మ్యాచ్ వేళల్లో మార్పులు

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్ షెడ్యూల్ ఖరారైంది. తాజా షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్‌ మ్యాచ్‌ల కోసం అర్ధరాత్రిదాకా మేల్కొని ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సాయంత్రం 4 గంటల మ్యాచ్‌ల సమయాన్ని 5.30 గంటలకు, రాత్రి 8 గంటలకు జరిగే మ్యాచ్‌లను 7 గంటలకే మార్చారు.

ఐపీఎల్ 11వ సీజన్‌ నుంచి ఐదేళ్ల కాలానికి ఐపీఎల్‌ ప్రసార హక్కుల్ని సొంతం చేసుకున్న స్టార్‌ స్పోర్ట్స్‌ సంస్థ కోరిక మేరకే మ్యాచ్‌ సమయాన్ని మారుస్తున్నట్లు ఐపీఎల్ ఛైర్మన్‌ రాజీవ్‌ శుక్లా వెల్లడించాడు. 'స్టార్ నెట్‌వర్క్ కోరినట్లు మ్యాచ్‌ వేళల్ని మార్చడానికి పాలకమండలి అంగీకరించింది. రోజుకు రెండు మ్యాచ్‌లు జరిగేది వారాంతాల్లో మాత్రమే. ఆ రెండు రోజులు ఒక మ్యాచ్‌కు ఇంకో మ్యాచ్‌ అడ్డం పడినప్పటికీ, వేర్వేరు ఛానెళ్లలో ఒకేసారి మ్యాచ్‌లు చూపించే సౌలభ్యం తమకుందని స్టార్ నెట్ వర్క్ చెప్పింది' అని శుక్లా తెలిపాడు.

 మ్యాచ్ సమయాల్లో మార్పు ఎందుకు?

మ్యాచ్ సమయాల్లో మార్పు ఎందుకు?

పదేళ్ల పాటు సాఫీగా సాగిన ఐపీఎల్‌లో ఇప్పటివరకు సాయంత్రం మ్యాచ్‌ 4 గంటలకు.. రాత్రి మ్యాచ్‌ 8 గంటలకు జరిగిన సంగతి తెలిసిందే. అయితే 11వ సీజన్‌లో రాత్రి మ్యాచ్‌ను ముందుకు జరిపి 7 గంటలకే మొదలుపెట్టనున్నారు. నిజానికి ఈ ప్రతిపాదన ఎప్పటినుంచో ఉంది. ఇందుకు కారణం కూడా ఉంది. రాత్రి 8 గంటలకు మొదలయ్యే మ్యాచ్‌ ముగియడానికి దాదాపు 11.30 అవుతుంది. ఆ సమయంలో స్టేడియాల నుంచి ప్రేక్షకులు ఇంటికి వెళ్లడం ప్రధాన సమస్యగా మారింది. మరికొన్ని మ్యాచ్‌లు అయితే ఆలస్యమై అర్ధరాత్రి తర్వాత ముగుస్తుంటాయి.

ప్రసారదారుకి లబ్ధి చేకూర్చడం కోసమే!

ప్రసారదారుకి లబ్ధి చేకూర్చడం కోసమే!

దీంతో రాత్రి 7 గంటలకు మ్యాచ్‌ ప్రారంభిస్తే ప్రైమ్‌ టైంలో ప్రసారదారుకి లబ్ధి చేకూరడంతో పాటు వీక్షకుల సంఖ్య కూడా పెరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇక వీక్ డేస్‌లో రోజుకో ఒక్కో మ్యాచ్, వీకెండ్‌లో మాత్రం రెండు మ్యాచ్‌లు నిర్వహించడం వల్ల అటు ఆటగాళ్లతో పాటు స్టేడియానికి వచ్చే ప్రేక్షకులకు సైతం అనుకూలంగా ఉంటుంది. అయితే రెండో మ్యాచ్‌ను ముందుగా నిర్వహించడం వల్ల సాయంత్రం 5.30 గంటలకు జరిగే మ్యాచ్‌కు అడ్డుం అవుతుందని ఐపీఎల్ నిర్వాహకులు ప్రసారుదారు సందేహాన్ని లెవనెత్తారు.

ఐపీఎల్ పాలక మండలి నిర్ణయం వెనుక కారణం

ఐపీఎల్ పాలక మండలి నిర్ణయం వెనుక కారణం

అయితే ఇందుకు ఎటువంటి ఇబ్బంది లేదని ఐపీఎల్ ప్రసారహక్కులను సొంతం చేసుకున్న స్టార్ నెట్‌వర్క్ చెప్పింది. తమకు వేర్వేరు ఛానెళ్లున్న నేపథ్యంలో ప్రసారం విషయంలో సమస్య ఉండదని నిర్వాహకులకు చెప్పడంతో ఈ ప్రతిపాదనకు అంగీకరించారు. ఇక, సాయంత్రం 4 గంటలకు మొదలయ్యే మ్యాచ్‌లను సాయంత్రం 5.30 గంటల నుంచి నిర్వహించడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని కూడా ఐపీఎల్ నిర్వాహకులు తెలిపారు. 4 గంటలకు మొదలయ్యే మ్యాచ్‌ కోసం మధ్యాహ్నం 2 గంటలకే స్టేడియానికి రావాల్సి ఉండేది. అసలే వేసవికాలం... దీంతో ప్రేక్షుకులు ఎండవేడిమిని తట్టుకోలేక నానా ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ఈ మ్యాచ్‌లను సాయంత్రం 5.30 గంటలకు నిర్వహిస్తుండటంతో ప్రేక్షుకులతో పాటు వీక్షకులకు ఎటువంటి ఇబ్బంది ఉండబోదని ఐపీఎల్‌ పాలక మండలి ఈ నిర్ణయం తీసుకుంది.

 ఏప్రిల్‌ 7 నుంచి మే 27 వరకు

ఏప్రిల్‌ 7 నుంచి మే 27 వరకు

ఇక, సోమవారం ఐపీఎల్ 11వ సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను పాలక మండలి ఖరారు చేసింది. ఏప్రిల్‌ 7 నుంచి మే 27 వరకు 11వ సీజన్ ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఏప్రిల్ 7న ముంబైలో మొదలై మే 27న వాంఖడే స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ముగియనుంది. మరోవైపు కింగ్స్‌లెవన్ పంజాబ్ తమ ఏడు మ్యాచ్‌లను మొహాలీలో నాలుగు, ఇండోర్‌లో మూడు ఆడనుంది. రెండేండ్ల తర్వాత తిరిగి లీగ్‌లోకి ప్రవేశించిన రాజస్థాన్ రాయల్స్ సొంతగడ్డపై ఆడే మ్యాచ్‌లపై సందిగ్ధత నెలకొన్నది. రాజస్థాన్ హైకోర్టులో ఈనెల 24 తీర్పు వచ్చిన తర్వాత ఓ నిర్ణయానికి వస్తామని శుక్లా తెలిపారు. జనవరి 27, 28 తేదీల్లో బెంగళూరు వేదికగా జరిగే వేలానికి 578 మంది ప్లేయర్లు అందుబాటులో ఉన్నారు.

Story first published: Tuesday, January 23, 2018, 10:44 [IST]
Other articles published on Jan 23, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+