హైదరాబాద్: ఈడెన్ గార్డెన్స్ వేదికగా గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్ సునీల్ నరేన్ అరుదైన ఘనత సాధించాడు. ఓపెనర్‌గా క్రీజులోకి వచ్చిన నరేన్ 17 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 42 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. 40కి పైగా పరుగుల్లో ఇదే అత్యధిక స్ట్రైక్ రేటు కావడం విశేషం.
ఓపెనర్‌గా వచ్చి ఫోర్లు, సిక్సులతో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్‌గా సునీల్ నరైన్ రికార్డు సృష్టించాడు. శ్రీలంక మాజీ బ్యాటింగ్ దిగ్గజం సనత్ జయసూర్య ఐపీఎల్ రికార్డుని సునీల్ నరేన్ బద్దలు కొట్టాడు. గతంలో డెక్కన్ ఛార్జర్స్ తరుపున ఆడిన జయసూర్య ఫోర్లు, సిక్సులతో 36 పరుగులు చేశాడు.
ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు
ఇప్పుడు ఆ రికార్డుని సునీల్ నరేన్ అధిగమించాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఓపెనర్ క్రిస్ లిన్‌కు గాయం కావడం వల్ల ఐపీఎల్‌లో అతని స్థానంలో ఆల్ రౌండర్ నరైన్ ఓపెనింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. బిగ్‌బాష్ టోర్నిలో మెల్‌బోర్న్ రెనెగాడ్స్ జట్టు తరపున ఓపెనర్‌గా అతడికి అనుభవం ఉన్నప్పటికీ ఐపీఎల్‌లో ఓపెనర్‌గా రావడం ఈ సీజన్‌లోనే మొదలైంది.
పంజాబ్‌తో ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో నైట్ రైడర్స్ ఓపెనర్‌గా తొలిసారిగా బరిలోకి దిగి సత్తా చాటాడు. 18 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు సాధించాడు. దీంతో నైట్ రైడర్స్ అతడిని ఓపెనర్ గా కొనసాగిస్తోంది.