For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్లే ఆఫ్ ఆశలు సజీవం: ముంబై గెలిచిన హైదరాబాద్

ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా సోమవారం సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్‌తో తలపడుతుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఎంచుకుంది.

By Nageshwara Rao

హైదరాబాద్: సొంతగడ్డపై మరోసారి తిరుగులేదని సన్ రైజర్స్ నిరూపించుకుంది. బరిలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో విజయం సాధించి ప్లే ఆఫ్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. హైదరాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

139 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ 18.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. వార్నర్‌ వికెట్‌ను ఆదిలోనే కోల్పోయినా మరో ఓపెనర్‌ శిఖర్‌ దావన్(46 బంతుల్లో 62 నాటౌట్‌)‌, హెన్రిక్స్‌(44 పరుగులు) సన్‌రైజర్స్‌ విజయంలో కీలకపాత్ర పోషించారు. ముంబై బౌలర్లలో మలింగ, బుమ్రా, క్లెనగన్‌లకు తలో వికెట్‌ దక్కింది.

సన్ రైజర్స్ విజయ లక్ష్యం 139

నగరంలో సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్లు తడబడ్డారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 7 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. దీంతో సన్ రైజర్స్ విజయ లక్ష్యాన్ని 139 పరుగులుగా నిర్దేశించింది.

ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ (67: 45 బంతుల్లో 6x4, 2x6) అర్ధ సెంచరీతో రాణించాడు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సిమన్స్(1)ని ఆదిలోనే పెవిలియన్‌కి పంపి హైదరాబాద్‌కి చక్కటి శుభారంభాన్నిచ్చాడు. అనంతరం వచ్చిన నితీశ్ రాణా (9)తో పాటు నిలకడగా ఆడిన మరో ఓపెనర్ పార్థీవ్ పటేల్‌ (23: 17 బంతుల్లో 1x4, 1x6 ) కూడా పది పరుగుల వ్యవధిలోనే అవుటయ్యాడు.

దీంతో ముంబై ఇండియన్స్ 36 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో హార్దిక్ పాండ్య (15: 24 బంతుల్లో)తో కలిసి కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ని నిర్మించాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ నాలుగో వికెట్‌కి 60 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

అయితే క్రీజులో తడబడుతున్న హార్దిక్ పాండ్య‌ాని స్పిన్నర్ రషీద్ ఖాన్ బుట్టలో వేయగా.. అనంతరం వచ్చిన పొలార్డ్ (5), కర్ణ్ శర్మ (5) చివర్లో భారీ షాట్ల కోసం ప్రయత్నిస్తూ వరుసగా అవుట్ కావడంతో ముంబై 138 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో సిద్ధార్థ కౌల్ మూడు, భువనేశ్వర్ రెండు, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్ చెరో వికెట్ తీశారు.

టాస్ గెలిచిన ముంబై

ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా సోమవారం సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్‌తో తలపడుతుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. సన్‌రైజర్స్‌లో మూడు మార్పులు చోటు చేసుకొన్నాయి.

విజయ్‌శంకర్‌, మహ్మద్‌ నబీ, సిరాజ్‌‌లకు తుది జట్టులో చోటు కల్పించారు. ఈ మ్యాచ్‌లో కేన్ విలిమయ్సన్‌, ఆశిశ్ నెహ్రా ఆడటం లేదు. గత రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై సన్ రైజర్స్ తీవ్ర ఒత్తడిలో ఈ మ్యాచ్ ఆడుతుండటంతో ఆసక్తి నెలకొంది. సన్‌రైజర్స్ నాకౌట్‌కు అర్హత సాధించాలంటే ఈ మ్యాచ్‌తో పాటు శనివారం గుజరాత్‌ లయన్స్‌తో జరిగే మ్యాచ్‌లో కూడా విజయం సాధించాల్సి ఉంది.

Mumbai Indians win the toss and elect to bat

మరోవైపు ఇప్పటికే ఫ్లే ఆఫ్‌కు అర్హత సాధించిన ముంబై జట్టు రిజర్వ్‌బెంచ్‌ను పరిశీలించేందుకు కోసం ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతోంది. ఈ సీజన్‌లో సొంతగడ్డపై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అద్భుతంగా రాణించింది. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడగా అందులో ఐదింటిలో విజయం సాధించింది.

శనివారం పూణెతో జరిగిన మ్యాచ్‌‌లో ఓటమి పాలై సొంతగడ్డపై తొలిఓటమి నమోదు చేసింది.

సన్ రైజర్స్ హైదరాబాద్:
డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్, హెన్రిక్యూస్, యువరాజ్ సింగ్, మహ్మద్ నబీ, విజయ్ శంకర్, నమన్ ఓజా, భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్, సిద్ధార్థ కౌల్, మహ్మద్ షిరాజ్

ముంబై ఇండియన్స్:
లెండి సిమన్స్, పార్థీవ్ పటేల్, నితీశ్ రాణా, రోహిత్ శర్మ, కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్య, కర్ణ్ శర్మ, హర్భజన్ సింగ్, మిచెల్ మెన్లనగాన్, జస్‌ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగ

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+