Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్: సచిన్‌కి బర్త్ డే గిఫ్ట్ ఇవ్వలేకపోయిన ముంబై, ఓటమి

హైదరాబాద్: వాంఖడె స్టేడియం వేదికగా పూణెతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 3 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 161 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ(39 బంతుల్లో 58, 6 ఫోర్లు, 3 సిక్సులు) ఒంటరి పోరాటం చేసినా జట్టుని ఓటమి నుంచి తప్పించలేకపోయాడు.

ముంబై విజయ లక్ష్యం 161

వాంఖడె స్టేడియంలో ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో పూణె నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 160 పరుగులు చేసింది. దీంతో ముంబైకి 161 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. పూణె ఓపెనర్లు రహానే (32 బంతుల్లో 38; 5 ఫోర్లు, ఒక సిక్సు), రాహుల్‌ త్రిపాఠి (31 బంతుల్లో 45; 3 ఫోర్లు, 2 సిక్సులు) రాణించారు.

వీరిద్దరూ తొలి వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తొలిసారి మ్యాచ్‌ ఆడుతున్న స్పిన్నర్‌ కర్ణ్‌శర్మ తన తొలి ఓవర్‌లోనే సత్తా చాటాడు. కర్ణ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 10వ ఓవర్‌ మూడో బంతికే రహానెను పెవిలియన్‌కు పంపాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన స్మిత్, ధోని, బెన్ స్టోక్స్‌లు దాటిగా ఆడే ప్రయత్నం చేసి విఫలమయ్యారు.

కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ భారీ షాట్‌కు ప్రయత్నించి హర్భజన్‌సింగ్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. గత మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్‌ ఆడి జట్టుకు విజయాన్ని అందించిన ధోనీ ఈ మ్యాచ్‌లో కేవలం 7 పరుగులకే పరిమితమయ్యాడు. బెన్‌స్టోక్స్‌(17) మరోసారి విఫలమయ్యాడు. ఆఖర్లో భారీ స్కోరు సాధించేందుకు మనోజ్‌ తివారీ(13 బంతుల్లో 22; 4 ఫోర్లు) పోరాడినా బుమ్రా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.

మనోజ్ తివారీ (22) దాటిగా ఆడే ప్రయత్నం చేసి ఆఖరి ఓవర్లో అవుటయ్యాడు. ముంబై బౌలర్లలో బుమ్రా, శర్మలకు రెండెసి వికెట్లు పడగా, జాన్సన్, హార్భజన్ లకు చెరో వికెట్ దక్కింది. ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా సోమవారం రైజింగ్ పూణె సూపర్ జెయింట్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ముంబైలోని వాంఖడె స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది.

ఆడిన ఏడు మ్యాచుల్లో ముంబై ఆరు వరుస విజయాలను సాధించింది. ముంబై జట్టులో యువ ఆల్‌రౌండర్‌ క్రునాల్‌ పాండ్యా గాయపడడంతో కర్ణ్‌శర్మ జట్టులోకి వచ్చాడు. ఈ సీజన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ముంబై పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్ధానంలో ఉండగా, పూణె ఐదో స్ధానంలో కొనసాగుతోంది.

సన్ రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి బంతికి ఫోర్ కొట్టి ధోని జట్టుని గెలిపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ మ్యాచ్‌లో ముంబైపై విజయం సాధించాలనే యోచనలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్‌ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని పూణె భావిస్తోంది.

ముంబై ఇండియన్స్:
P Patel, J Buttler, N Rana, RG Sharma, K Pollard, H Pandya, K Sharma, H Singh, J Bumrah, M McClenaghan, M Johnson

రైజింగ్ పూణె సూపర్ జెయింట్:
A Rahane, R Tripathi, S Smith, B Stokes, M Tiwary, MS Dhoni, D Christian, W Sundar, S Thakur, J Unadkat, I Tahir

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+