For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్, మ్యాచ్ 14: ఈడెన్‌లో హైదరాబాద్‌కు మరో ఓటమి

ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్ల మధ్య శనివారం మ్యాచ్‌ జరుగుతుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యా

By Nageshwara Rao

హైదరాబాద్: ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలైంది. ఈ సీజన్‌లో హైదరాబాద్ కు ఇది వరుసగా రెండో ఓటమి. అటు బౌలింగ్‌లోనూ, ఇటు బ్యాటింగ్‌లోనూ విఫలం కావడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 17 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

173 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. సన్ రైజర్స్ ఆటగాళ్లలో డేవిడ్ వార్నర్ (26), శిఖర్ ధావన్ (23), హెన్రిక్స్ (13), యువరాజ్ సింగ్ (26), దీపక్ హుడా (13), కట్టింగ్(15) పరుగులు చేశారు.

కోల్‌కతా బౌలర్లలో క్రిస్ వోక్స్ రెండు వికెట్లు తీసుకోగా బౌల్ట్, సునీల్ నరైన్, కుల్దీప్ యాదవ్, యూసఫ్ పఠాన్‌లు తలో వికెట్ తీశారు.


హైదరాబాద్ విజయ లక్ష్యం 173

ఈడెన్ గార్డెన్స్ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయ లక్ష్యం 172 పరుగులుగా నిర్దేశించింది.

కోల్‌కతా బ్యాట్స్‌మెన్లలో రాబిన్ ఉతప్ప 39 బంతుల్లో 68 పరుగులు చేయగా, మనీష్ పాండే 46 పరుగులతో రాణించాడు. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు తీయగా, నెహ్రా, బెన్ కట్టింగ్, రషీద్ ఖాన్ తలో వికెట్ తీసుకున్నారు. హైదరాబాద్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ చక్కటి శుభారంభాన్నిచ్చాడు.

భువీ వేసిన మూడో ఓవర్‌ రెండో బంతికి కోల్‌కతా ఓపెనర్‌ సునీల్‌ నరైన్‌ (6) క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. అనంతరం క్రీజులోకి రాబిన్ ఊతప్ప వచ్చాడు. రాబిన్ ఊతప్ప ఎదుర్కొన్న తొలి బంతి ఎడ్జి తీసుకుని వికెట్ కీపర్ నోమన్ ఓజా చేతిలో పడింది. దీంతో బౌలర్ భువనేశ్వర్ కుమార్ తో పాటు హైదరాబాద్ ఆటగాళ్లు అప్పీల్ చేశారు.

అయితే అంఫైర్ అనిల్ దండేకర్ నాటౌట్ ఇచ్చాడు. ఈ నిర్ణయం సన్ రైజర్స్ ఆటగాళ్లను నిరాశకు గురి చేసింది. రాబిన్ ఊతప్ప క్లియర్‌గా అవుటైనట్లు కనిపిస్తున్నా అంఫైర్ నాటౌట్ అని ప్రకటించడం విస్మయానికి గురి చేసింది. అంఫైర్ తప్పిదంతో కోల్‌కతా బ్యాట్స్‌మన్ రాబిన్ ఉతప్ప సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు.

39 బంతుల్లో 5 ఫోర్లు 4 సిక్సర్లతో 68 పరుగులు చేసి బెన్ కట్టింగ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి రషీద్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్ల మధ్య శనివారం మ్యాచ్‌ జరుగుతుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఫీల్డింగ్ ఎంచుకుంది. రెండు జట్లలో కూడా స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో ముస్తాఫిజుర్‌, శంకర్‌ స్థానంలో మోజెస్‌ హెన్రిక్స్‌, బిపుల్‌శర్మలకు చోటు కల్పించారు. ఇక కోల్‌కతా జట్టులో కొలిన్‌ గ్రాండ్‌హోమ్‌, కుల్‌దీప్‌ యాదవ్‌ ఆడనున్నారు.

ఈ మ్యాచ్ ద్వారా విజయం సాధించి గంభీర్ సేనపై గెలుపోటముల రికార్డు మెరుగు పరుచుకోవాలని డేవిడ్‌ వార్నర్‌ బృందం తలపిస్తోంది. సన్ రైజర్స్‌పై ఈడెన్‌గార్డెన్స్‌లో కోల్‌కతా మెరుగైన రికార్డు ఉంది. ఇప్పటివరకు ఇక్కడ జరిగిన నాలుగు మ్యాచుల్లో కోల్‌కతానే విజయం సాధించింది.

IPL 10: Match 14: Sunrisers Hyderabad win the toss and elect to field

దీంతో శనివారం నాటి మ్యాచ్‌లో విజయం సాధించి ఈడెన్‌ గార్డెన్స్‌లో వార్నర్ సేన తొలి గెలుపు రుచిచూడాలని భావిస్తోంది. కాగా ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఈ రెండు జట్లు 9 మ్యాచుల్లో తలపడగా కోల్‌కతా 6, హైదరాబాద్‌ 3 గెలిచాయి.

జట్ల వివరాలు:
సన్ రైజర్స్ హైదరాబాద్:

D Warner, S Dhawan, M Henriques, Y Singh, D Hooda, B Cutting, N Ojha, B Kumar, B Sharma, R Khan, A Nehra

కోల్‌కతా నైట్ రైడర్స్:
G Gambhir, R Uthappa, M Pandey, Y Pathan, S Yadav, C de Grandhomme, C Woakes, S Narine, K Yadav, U Yadav, T Boult

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+