Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

25 పరుగులు: క్రిస్ గేల్ చరిత్ర సృష్టిస్తాడా? (ఫోటోలు)

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రిస్ గేల్ అరుదైన ఘనతను అందుకోనున్నాడు. టీ20ల్లో విధ్వంసకర బ్యాట్స్ మెన్‌గా పేరొందిన క్రిస్ గేల్ కొత్త చరిత్రను సృష్టించనున్నాడు. మరో 25 పరుగులు సాధిస్తే ట్వంటీ 20 క్రికెట్‌లో పదివేల పరుగులను సాధించిన తొలి క్రికెటర్‌గా క్రిస్ గేల్ చరిత్ర సృష్టిస్తాడు.

ఐపీఎల్‌లో భాగంగా సోమవారం ఇండోర్ వేదికగా పంజాబ్ జట్టుతో జరగనున్న మ్యాచ్‌‌లో ఏ బ్యాట్స్‌మన్‌కు సాధ్యం కాని ఘనతను సాధించేందుకు గేల్ ఉవ్విళ్లూరుతున్నాడు. నిజానికి ఐపీఎల్ 10వ సీజన్ ఆరంభ మ్యాచ్‌ల్లోనే క్రిస్ గేల్ ఈ రికార్డును సాధిస్తాడని అందరూ భావించినప్పటికీ అది జరగలేదు. ఐపీఎల్ 10వ సీజన్ ఆరంభానికి ముందు పదివేల పరుగుల మైలురాయికి 63 పరుగులు దూరంలో ఉన్న గేల్ ఆ రికార్డును అందుకోవడంలో విఫలమయ్యాడు.

రెండు ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 38 పరుగులు

రెండు ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 38 పరుగులు

ఇప్పటివరకు రెండు ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన క్రిస్ గేల్ 32, 6 పరుగులతో 38 పరుగులు చేసి నిరాశపరిచాడు. ఐపీఎల్ 10వ సీజన్ ప్రారంభ వేడుకల అనంతరం హైదరాబాద్ వేదికగా సన్ రైజర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 32 పరుగులు చేసిన గేల్, ఆ తర్వాత ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 పరుగులు చేశాడు.

పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌లో ఆ ఘనత

పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌లో ఆ ఘనత

దీంతో సోమవారం రాత్రి ఇండోర్ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌లో ఆ ఘనతను క్రిస్ గేల్ సాధించే అవకాశం ఉంది. ఐపీఎల్‌లో క్రిస్ గేల్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తరుపున అరంగేట్రం చేశాడు. అయితే 2011 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరుపున ఆడుతున్నాడు.

ఐపీఎల్‌లో క్రిస్ గేల్ పేరిట అనేక రికార్డులు

ఐపీఎల్‌లో క్రిస్ గేల్ పేరిట అనేక రికార్డులు

ఇప్పటికే ఐపీఎల్‌లో క్రిస్ గేల్ పేరిట అనేక రికార్డులు నమోదయ్యాయి. ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా క్రిస్ గేల్ ఉన్నాడు. పూణెతో జరిగిన మ్యాచ్‌లో క్రిస్ గేల్ 66 బంతుల్లో 13 ఫోర్లు, 17 సిక్సుల సాయంతో 175 నాటౌట్‌గా నిలిచాడు. ఈ రికార్డుని గేల్ 2013 ఐపీఎల్‌లో నమోదు చేశాడు.

అత్యధిక సిక్సులు బాదిన రికార్డు

అత్యధిక సిక్సులు బాదిన రికార్డు

ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సులు బాదిన రికార్డు కూడా క్రిస్ గేల్‌దే. 175 పరుగుల సాధించే క్రమంలో క్రిస్ గేల్ 17 సిక్సులు బాదాడు. ఐపీఎల్‌లో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా బెంగళూరు నిలిచింది. 2013, ఏప్రిల్ 23న బెంగళూరులో పూణెపై జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 263 పరుగులు చేసింది.

అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడు క్రిస్ గేల్

అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడు క్రిస్ గేల్

ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా క్రిస్ గేల్ ఉన్నాడు. ఇప్పటివరకు క్రిస్ గేల్ 5 సెంచరీలు చేశాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన ఆటగాడిగా క్రిస్ గేల్ నిలిచాడు. కేవలం 30 బంతుల్లోనే క్రిస్ గేల్ సెంచరీ సాధించాడు. 2013లో పూణె జట్టుపై క్రిస్ గేల్ ఈ రికార్డుని నెలకొల్పాడు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+