ఐపీఎల్ 10: ఈ సీజన్‌లోనైనా ఈ రికార్డులు బద్దలవుతాయా?
హైదరాబాద్: మరికొన్ని గంటల్లో ఐపీఎల్ 10వ సీజన్ ప్రారంభం కానుంది. ప్రారంభ వేడుకల కోసం నగరంలోని ఉప్పల్ స్టేడియం అంగరంగ వైభవంగా ముస్తాబైంది. ఇప్పటికే స్టార్ క్రికెటర్లందరూ నగరానికి విచ్చేశారు. తొలి మ్యాచ్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి.
2007లో ఐపీఎల్ తొలి సీజన్ ప్రారంభమైంది. ఆ తర్వాత ఏడాది జరిగిన సీజన్‌లో ఐపీఎల్ చరిత్రలో కొన్ని అద్భుతమైన రికార్డులు నమోదయ్యాయి. ఏప్రిల్ 18, 2008న బెంగళూరులోని చిన్నసామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్‌పై కోల్ కతా ఆటగాడు బ్రెండన్ మెక్ కల్లమ్ 158 పరుగులతో సెంచరీ చేసిన నాటౌట్‌గా నిలిచాడు.
అప్పట్లో ఇదొక సంచలనం. అయితే ఈ రికార్డు ఎక్కువ కాలం నిలవలేదు. మెక్ కల్లమ్ నమోదు చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డుని సరిగ్గా ఐదేళ్ల క్రితం బెంగళూరు ఆటగాడు క్రిస్ గేల్, పూణెతో జరిగిన మ్యాచ్‌లో బద్దలు కొట్టాడు. ఆ మ్యాచ్‌లో క్రిస్ గేల్ 175 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
దీంతో ఐపీఎల్‌లో అత్యధిక స్కోరు నమోదు చేసిన ఆటగాడి రికార్డుని క్రిస్ గేల్ సొంతం చేసుకున్నాడు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో అనేక రికార్డులు నమోదయ్యాయి. అనేక రికార్డులు బద్దలయ్యాయి. అయితే ఐపీఎల్ పదో సీజన్‌లో పాత రికార్డులన్నీ బద్దలవుతాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఐపీఎల్‌లో ఇప్పటివరకు నమోదైన 10 అత్యుత్తమ రికార్డులివే:

ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు క్రిస్ గేల్‌దే
ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన ఓపెనర్ క్రిస్ గేల్ ఉన్నాడు. పూణెతో జరిగిన మ్యాచ్‌లో క్రిస్ గేల్ 66 బంతుల్లో 13 ఫోర్లు, 17 సిక్సుల సాయంతో 175 నాటౌట్‌గా నిలిచాడు. ఈ రికార్డుని గేల్ 2013 ఐపీఎల్‌లో నమోదు చేశాడు.

అత్యధిక సిక్సుల రికార్డు కూడా గేల్‌దే
ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సులు బాదిన రికార్డు కూడా క్రిస్ గేల్‌దే. 175 పరుగుల సాధించే క్రమంలో క్రిస్ గేల్ 17 సిక్సులు బాదాడు.

అత్యధిక జట్టు స్కోరు బెంగళూరు 263/5
ఐపీఎల్‌లో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా బెంగళూరు నిలిచింది. 2013, ఏప్రిల్ 23న బెంగళూరులో పూణెపై జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 263 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో క్రిస్ గేల్ 175 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.

ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడు క్రిస్ గేల్
ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా క్రిస్ గేల్ ఉన్నాడు. ఇప్పటివరకు క్రిస్ గేల్ 5 సెంచరీలు చేశాడు. గేల్ తర్వాతి స్ధానంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు. కోహ్లీ నాలుగు సెంచరీలు చేశాడు. ఆ తర్వాత ఏబీ డివిలియర్స్ ఉన్నాడు. డివిలియర్స్ మూడు సెంచరీలు చేశాడు. ఈ ముగ్గురూ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుకు చెందినవారే.

ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కోహ్లీ 973
ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు (973) చేసిన ఆటగాడు కోహ్లీ నిలిచాడు. 16 ఇన్నింగ్స్‌ల్లో విరాట్ కోహ్లీ 4 సెంచరీలు, 7 అర్ధసెంచరీలు చేశాడు. ఒక సీజన్‌లో నాలుగు సెంచరీలు చేసిన ఆటగాడిగా కూడా కోహ్లీ అరుదైన గుర్తింపు పొందాడు.

ఒక ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ బౌలింగ్ 6/14
ఒక ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ బౌలింగ్ (6/14) వేసిన బౌలర్‌గా పాకిస్థాన్ పేసర్ సోహల్ తన్వీర్ నిలిచాడు. ఇదొక అద్భుతమైన రికార్డు. ఈ రికార్డుని 2008 ఐపీఎల్ సీజన్‌లో తన్వీర్ నెలకొల్పాడు. 2009లో జైపూర్‌లో రాజస్ధాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డుని సాధించాడు.

అత్యధిక వికెట్ భాగస్వామ్యం
ఐపీఎల్‌లో ఏ వికెట్ కైనా అత్యధిక భాగస్వామ్యం 229 పరుగులు. బెంగళూరు ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ ఈ రికార్డుని నెలకొల్పారు. మే 14, 2016న బెంగళూరులో గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వీరిద్దరూ ఈ రికార్డుని నెలకొల్పారు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 109, డివిలియర్స్ 129 పరుగులు చేశారు.

ఒక సీజన్‌లో అత్యధిక వికెట్లు 32
ఒక సీజన్‌లో పడగొట్టిన అత్యధిక వికెట్లు 32. 2013లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు డ్వేన్ బ్రావ్ ఈ రికార్డుని నెలకొల్పాడు.

ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక ఫోర్లు 19
ఒక ఇన్నింగ్స్‌లో సాధించిన అత్యధిక ఫోర్లు 19. ఈ రికార్డు ఏబీ డివిలియర్స్, పాల్ వాల్తాటీ సంయుక్తంగా నెలకొల్పారు. 2015లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డివిలియర్స్ ఈ రికార్డుని సాధిస్తే, 2011లో చెన్నైపై పాల్ వాల్తాటీ ఈ రికార్డుని సాధించాడు.

అత్యంత వేగంగా సెంచరీ
ఐపీఎల్‌లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన ఆటగాడిగా క్రిస్ గేల్ నిలిచాడు. కేవలం 30 బంతుల్లోనే క్రిస్ గేల్ సెంచరీ సాధించాడు. 2013లో పూణె జట్టుపై క్రిస్ గేల్ ఈ రికార్డుని నెలకొల్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications