48 గంటల్లో 25 లక్షలు: ఐపీఎల్ థీమ్ సాంగ్‌కు భారీ స్పందన
హైదరాబాద్: ఐపీఎల్ పదవ సీజన్‌కు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఏప్రిల్ 5 నుంచి ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2017 కోసం రూపొందించిన థీమ్ సాంగ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ థీమ్ సాంగ్‌ను రెండు రోజుల క్రితం విడుదల చేశారు.
ఐపీఎల్ పదవ సీజన్‌లో అడుగుపెడుతున్న సందర్భంగా 'దస్ సాల్ ఆప్కే నామ్' అనే టైటిల్‌తో ఈ థీమ్ సాంగ్‌ను రూపొందించారు. బాలీవుడ్ సంగీత దర్శకుడు సలీమ్-సులేమాన్ సంగీతం అందించిన ఈ పాటను బెన్నీ డాయల్ పాడారు. ప్రముఖ సంస్థ సోనీమ్యాక్స్ ఈ పాట వీడియోని ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది.
ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన 48 గంటల్లోనే 25లక్షల మందికి పైగా అభిమానులు ఈ వీడియోను చూశారు. ఈ వీడియోకి అభిమానుల నుంచి భారీ స్పందన వస్తోంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్‌లో ఉంది. ఇదిలా ఉంటే ఏప్రిల్ 5న హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ అట్టహాసంగా ప్రారంభం కానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications