Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పదేళ్ల ఐపీఎల్: 'టీ20 కింగ్' యువీనే టాప్, ఖరీదైన ఆటగాళ్లు వీరే

హైదరాబాద్: తొమ్మిది సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రస్తుతం పదో సీజన్‌లోకి అడుగుపెట్టింది. ఈ పదేళ్ల ఐపీఎల్‌లో చోటు చేసుకున్న కొన్ని ఆసక్తికర విషయాలను పాఠకుల కోసం ప్రత్యేకంగా అందిస్తోన్న సంగతి తెలిసిందే.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు

ఐపీఎల్ అంటేనే క్యాష్ రిచ్ టోర్నీ. ఈ టోర్నీలో ఆటగాళ్ల ఎంపిక వేలం ద్వారా జరుగుతుంది. అయితే వేలం పాటలో స్వదేశీ ఆటగాళ్లతో పాటు కొందరు విదేశీ ఆటగాళ్ల అత్యధిక ధర పలికి రికార్డులను సైతం నెలకొల్పారు. భారత్‌లో క్రికెట్ అంటే ఎంతో క్రేజ్.

క్రికెట్‌ను అమితంగా ఆరాధించే ఈ దేశంలో బీసీసీఐ 2008లో ప్రాంఛైజీ ఆధారంగా ఈ ఐపీఎల్ టోర్నీని ఆవిష్కరించింది. భారత్‌లో ఐపీఎల్ అత్యంత ఆదరణ పొందడంతో దీనిని ప్రేరణగా తీసుకుని ఆస్ట్రేలియాలో బిగ్ బాష్ లీగ్ పుట్టుకొచ్చింది. ఈ పదేళ్ల ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా యువరాజ్ సింగ్ నిలిచాడు.

ఐపీఎల్ చరిత్రలో టాప్ 10ఖరీదైన ఆటగాళ్లు:

నోట్: ఆటగాళ్ల ధరను 'డాలర్' లో సూచించడం జరిగింది. ఎందుకంటే రూపీ విలువ హెచ్చు తగ్గులు ఉంటుంది కాబట్టి.

యువరాజ్ సింగ్: $ 2.67 మిలియన్

యువరాజ్ సింగ్: $ 2.67 మిలియన్

యువరాజ్ సింగ్ గురించి భారత్ క్రికెట్ అభిమానులకు చెప్పాల్సిన పనిలేదు. ఐపీఎల్ 2015 సీజన్‌ కోసం నిర్వహించి వేలంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఫ్రాంచైజీ యువీని రూ. 16 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. అంతకముందు 2014 ఐపీఎల్ వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రాంఛైజీ రూ. 14 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఆ తర్వాతి సీజన్‌లో బెంగళూరు యువీని వదులుకుంది.

ఇప్పటికి టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా అర్ధసెంచరీ చేసిన రికార్డు యువీ పేరిట ఉంది. ఐసీసీ వరల్డ్ టీ20లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ ఈ ఘనత సాధించాడు. ఇదే ఫార్మెట్‌లో ఒకే ఓవర్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సులు బాదిన ఘనత కూడా యువరాజ్ సింగ్‌దే .

గౌతం గంభీర్: $ 2.4 మిలియన్

గౌతం గంభీర్: $ 2.4 మిలియన్

2011 సీజన్ కోసం నిర్వహించిన వేలంలో గౌతం గంభీర్‌ని కోల్ కతా ప్రాంచైజీ $ 2.4 మిలియన్ పెట్టి కొనుగోలు చేసింది. అదే సీజన్‌లో కోల్ కతా జట్టుకు కెప్టెన్ అయిన గంభీర్ ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. గంభీర్ నేతృత్వంలోని కోల్ కతా జట్టు ఆ తర్వాతి సీజన్ 2012, 2014లో ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచింది.

బెన్ స్టోక్స్ : $ 2.16 మిలియన్

బెన్ స్టోక్స్ : $ 2.16 మిలియన్

ఇంగ్లాండ్‌కు చెందిన ఈ ఆల్ రౌండర్‌ 2017 సీజన్ కోసం నిర్వహించిన ఐపీఎల్ వేలంలో కనీస ధరను రూ. 2 కోట్లుగా నిర్ణయించారు. అయితే వేలంలో చివరకు రైజింగ్ పూణె సూపర్ జెయింట్ ప్రాంఛైజీ రూ. 14.5 కోట్లు వెచ్చించి ఇతడిని దక్కించుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదు పలికిన విదేశీ ఆటగాడిగా బెన్ స్టోక్స్ నిలిచాడు.

యూసఫ్ పఠాన్:

యూసఫ్ పఠాన్:

బరోడాకు చెందిన యూసఫ్ పఠాన్ ఐపీఎల్ తొలి సీజన్లలో అత్యంత ప్రభావితం చేసిన ఆటగాడిగా నిలిచాడు. రాజస్ధాన్ రాయల్స్ జట్టు తరుపున ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 2011లో పఠాన్‌ని $ 2.1 మిలియన్‌కి కోల్ కతా ప్రాంఛైజీ కొనుగోలు చేసింది.

రాబిన్ ఊతప్ప: $ 2.1 మిలియన్

రాబిన్ ఊతప్ప: $ 2.1 మిలియన్

దేశవాళీ క్రికెట్‌లో కర్ణాటక జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న రాబిన్ ఊతప్ప దూకుడైన క్రికెట్‌ను ఆడటంలో సిద్ధహస్తుడు. 2011లో పూణె వారియర్స్ రాబిన్ ఊతప్పను $ 2.1 మిలియన్ పెట్టి కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఐపీఎల్ నుంచి పూణె వారియర్స్ వైదొలగడంతో కోల్ కతా ఊతప్పను కోనుగోలు చేసింది.

దినేశ్ కార్తీక్: $ 2.08 మిలియన్

దినేశ్ కార్తీక్: $ 2.08 మిలియన్

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో వికెట్ కీపర్-బ్యాట్స్ మెన్‌గా రాణిస్తున్న ఆటగాళ్లలో దినేశ్ కార్తీక్ ఒకడు. తమిళనాడుకు చెందిన దినేశ్ కార్తీక్ రంజీల్లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. దీంతో ఢిల్లీ డేర్ డెవిల్స్ ప్రాంఛైజీ దినేశ్ కార్తీక్‌ని $ 2.08 మిలియన్ వెచ్చించి కొనుగోలు చేసింది. ఏ పొజిషన్‌లోనైనా రాణించ కలిగే సత్తా ఉన్న ఆటగాడు దినేశ్ కార్తీక్.

రోహిత్ శర్మ : $ 2 మిలియన్

రోహిత్ శర్మ : $ 2 మిలియన్

ఐపీఎల్‌లో రోహిత్ శర్మ ముంబై జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. తొలుత డెక్కన్ ఛార్జర్స్‌కు ఆడిన రోహిత్ శర్మను ఆ తర్వాత 2011లో నిర్వహించిన వేలంలో ముంబై ఇండియన్స్ ప్రాంచైజీ $ 2 మిలియన్ వెచ్చించి కొనుగోలు చేసింది. రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు రెండు సార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా అవతరించింది.

రవీంద్ర జడేజా: $ 2 మిలియన్

రవీంద్ర జడేజా: $ 2 మిలియన్

2012లో రవీంద్ర జడేజాను చెన్నై సూపర్ కింగ్స్ ప్రాంఛైజీ $ 2 మిలియన్ వెచ్చించి కొనుగోలు చేసింది. సౌరాష్ట్రకు చెందిన రవీంద్ర జడేజా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో మెరుగైన ఇన్నింగ్స్ ఆడాడు.

ఇర్పాన్ పఠాన్ : $ 1.9 మిలియన్

ఇర్పాన్ పఠాన్ : $ 1.9 మిలియన్

2011లో ఢిల్లీ డేర్ డెవిల్స్ ప్రాంఛైజీ $ 1.9 మిలియన్ వెచ్చించి ఇర్ఫాన్ పఠాన్‌ని కొనుగోలు చేసింది. టీ20 ఫార్మెట్‌లో ఏ స్ధానంలోనైనా రాణించగలిగే క్రికెటర్లలో ఇర్ఫాన్ పఠాన్ ఒకడు. వికెట్లు పడుతున్నా, బిగ్ షాట్స్ ఆడగలిగే సత్తా పఠాన్‌కు ఉంది.

సౌరభ్ తివారీ : $ 1.6 మిలియన్

సౌరభ్ తివారీ : $ 1.6 మిలియన్

జార్ఖండ్‌కు చెందిన సౌరభ్ తివారీని 2011 సీజన్ కోసం నిర్వహించిన వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రాంఛైజీ $ 1.6 మిలియన్ వెచ్చించి కొనుగోలు చేసింది. బిగ్ హిట్టింగ్ బ్యాట్స్ మెన్ గా తివారీకి పేరుంది. దేశవాళీ క్రికెట్‌లో తివారీ అద్భుతమైన ప్రదర్శన చేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+