Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వెనక్కి తగ్గిన ఐవోఏ: కల్మాడీ, చౌతాలాల నియామకాలు రద్దు

హైదరాబాద్: ఎట్టకేలకు భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) వెనక్కి తగ్గింది. కామన్వెల్త్‌ గేమ్స్‌లో అవినీతికి పాల్పడిన సురేష్‌ కల్మాడీ, అవినీతి మకిల అంటుకున్న అభయ్‌ సింగ్‌ చౌతాలా నియామకాలను రద్దు చేసినట్లు ఐవోఏ అధికారిక ప్రతినిధి మంగళవారం వెల్లడించారు.

కొరడా ఝుళిపించింది: ఐవోఏపై వేటు వేసిన కేంద్ర క్రీడాశాఖ

వివరాల్లోకి వెళితే భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) వార్షిక సర్వసభ్య సమావేశంలో సురేష్ కల్మాడీ, చౌతాలాలను జీవితకాల అధ్యక్షులుగా నియమించింది. వీరిద్దరినీ జీవిత కాల గౌరవాధ్యక్షులుగా నియమించడం తీవ్ర వివాదాస్పదమైంది. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ కామన్వెల్త్ (2010) క్రీడల కుంభకోణంలో నిందితులుగా ఉన్న వీరిద్దరికి ఐఓఏ పదవులు కట్టబెట్టడంపై కేంద్ర క్రీడల మంత్రి విజయ్‌ గోయెల్‌ సైతం తప్పుపట్టారు.

ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. దీంతో వీరిద్దరి ఎంపిక విషయంలో చెలరేగిన వివాదం నేపథ్యంలో కేంద్ర క్రీడాశాఖ ఐవోఏకి షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. అయితే కేంద్ర క్రీడాశాఖ జారీ చేసిన షోకాజ్ నోటీసుకు ఐవోఓ బదులివ్వలేదు. ఈ నేపథ్యంలో ఐవోఏపై కేంద్ర క్రీడాశాఖ సస్పెన్షన్ విధించింది.

తాము జారీ చేసిన షోకాజ్ నోటీసుకు బదులు ఇవ్వనుందుకు గాను ఐవోఏను సస్పెండ్ చేసినట్లు కేంద్ర క్రీడా మంత్రి విజయ్ గోయల్ ప్రకటించారు. కామన్వెల్త్ దోషులు సురేశ్ కల్మాడీ, అభయ్ సింగ్ చౌతాల నియామకాలను రద్దు చేసేవరకు ఇది అమల్లో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

తప్పుడు నిర్ణయాలను ప్రభుత్వం సమర్థించదు

తప్పుడు నిర్ణయాలను ప్రభుత్వం సమర్థించదు

'తప్పుడు నిర్ణయాలను ప్రభుత్వం ఎప్పుడూ సమర్థించదు. చాలా సీరియస్ అంశంపై మేం ఐవోఏకు షోకాజ్ నోటీసు జారీ చేశాం. దానిపై స్పందించకుండా 15 రోజులు గడువు కావాలని కోరారు. ఇది సరైంది కాదు. అందుకే సస్పెండ్ చేశాం. కల్మాడీ, చౌతాల నియామకాలు రద్దు చేసే వరకు సస్పెన్షన్ కొనసాగుతుంది' అని ఆయన వెల్లడించారు.

ఐవోఏకు కట్టబెట్టిన ప్రత్యేక అధికారాలన్నీ రద్దు

ఐవోఏకు కట్టబెట్టిన ప్రత్యేక అధికారాలన్నీ రద్దు

కేంద్ర నిర్ణయంతో ప్రభుత్వం ఐవోఏకు కట్టబెట్టిన ప్రత్యేక అధికారాలన్నీ రద్దు అవుతాయన్నారు. అంతేకాదు ప్రభుత్వం నుంచి ఐవోఏకు ఎలాంటి ఆర్థిక సహకారం కూడా ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర క్రీడా శాఖ నిర్ణయంతో ఐవోఏ దెబ్బకు దిగొచ్చింది. వారిద్దరి నియామకాలను రద్దు చేసింది.

1996-2011 వరకు ఐవోఏ అధ్యక్షుడిగా కల్మాడీ

1996-2011 వరకు ఐవోఏ అధ్యక్షుడిగా కల్మాడీ

1996-2011 వరకు కల్మాడీ ఐవోఏ అధ్యక్షుడిగా ఉన్నాడు. 2010లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌ సందర్భంగా భారీ స్కామ్‌లకు పాల్పడడంతో 10 నెలల జైలుశిక్ష అనుభవించి బెయిల్‌పై విడుదలయ్యాడు. కల్మాడీ.. ఆసియా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ జీవితకాల అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు.

2012 నుంచి 2014 ఫిబ్రవరి వరకు ఐవోఏ అధ్యక్షుడిగా చౌతాలా

2012 నుంచి 2014 ఫిబ్రవరి వరకు ఐవోఏ అధ్యక్షుడిగా చౌతాలా

2012 నుంచి 2014 ఫిబ్రవరి వరకు చౌతాలా ఐవోఏ అధ్యక్షుడిగా ఉన్నాడు. కానీ అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐవోసీ).. ఐవోఏపై సస్పెన్షన్‌ వేటు వేయడంతో చార్జ్‌షీట్‌లో పేరున్న వారు ఎన్నికల్లో పోటీకి అనర్హులని సవరణ చేశారు. ఆ తర్వాత కానీ ఐవోఏపై సస్పెన్షన్‌ ఎత్తివేయలేదు. తాజాగా హర్యానా ఒలింపిక్‌ సంఘానికి చౌతాలా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.

ఐవోఏ జీవిత‌కాల అధ్య‌క్షుడి ఆఫర్‌ను తిరస్కరించిన క‌ల్మాడీ

ఐవోఏ జీవిత‌కాల అధ్య‌క్షుడి ఆఫర్‌ను తిరస్కరించిన క‌ల్మాడీ

మరోవైపు ఐవోఏకు జీవిత‌కాల అధ్య‌క్షుడిగా ఉండాల‌ంటూ ఇచ్చిన ఆఫ‌ర్‌ను సురేశ్ క‌ల్మాడీ తిర‌స్క‌రించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను ఈ పదవి చేపట్టలేనంటూ ఐఓఏకు కల్మాడీ లేఖ రాశాడు. 'నన్ను జీవిత కాల అధ్యక్ష పదవితో గౌరవించాలనుకున్నందుకు ఐఓఏకు ధన్యవాదాలు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పదవిని నేను అంగీకరించడం సబబు కాదని భావిస్తున్నా. నా పేరు స్వచ్ఛంగా బయటికి వస్తుందని నమ్మకంతో ఉన్నా. అప్పటి వరకు ఈ గౌరవాన్ని నేను స్వీకరించలేను' అని కల్మాడీ ఈ లేఖలో పేర్కొనడం విశేషం.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+