'యాషెస్‌ సిరీస్‌ కన్నా..భారత్‌-పాక్‌ మ్యాచ్‌లనే ఎక్కువగా చూస్తారు!దాయాదుల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగాలి'

Inzamam-ul-Haq Seeks India-Pak Bilateral Series For 'Betterment' Of Cricket | Oneindia Telugu

కరాచీ: భారత్‌-పాకిస్థాన్‌ జట్ల మధ్య తిరిగి క్రికెట్‌ కొనసాగాలని, ద్వైపాక్షిక సిరీస్‌లు జరగాలని పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ అన్నాడు. ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌ కన్నా.. దాయాదుల పోరే ఎక్కువగా చూస్తారని, ఆ క్షణాలను అభిమానులు పూర్తిగా ఆస్వాదిస్తారని చెప్పాడు. ఇరు జట్ల మధ్య ఆట బలోపేతానికి, ఆటగాళ్ల అభివృద్ధికి ఆసియా కప్‌తో పాటు ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం ఎంతో ముఖ్యమని ఇంజమామ్‌ తెలిపాడు. భారత్‌-పాక్‌ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడంతో గతకొంతకాలంగా ఇరు దేశాలు మ్యాచులు ఆడడం లేదు. ఐపీఎల్ టోర్నీలో కూడా పాక్ ఆటగాళ్లు ఆడడం లేదు.

WTC Final 2021: 'టీమిండియా వెంట పరిగెత్తకు.. అదే నిన్ను అనుసరిస్తుంది'

యాషెస్‌ సిరీస్‌ కన్నా ఎక్కువ:

యాషెస్‌ సిరీస్‌ కన్నా ఎక్కువ:

తాజాగా ఓ క్రీడాఛానెల్‌తో ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ మాట్లాడుతూ... 'యాషెస్‌ సిరీస్‌ కన్నా ఎక్కువ ప్రజలు భారత్‌-పాక్‌ మ్యాచ్‌లను వీక్షిస్తారు. ఇందులో ప్రతి క్షణాన్ని వారు ఆస్వాదిస్తారు. ఇరు జట్ల మధ్య ఆట బలోపేతానికి, ఆటగాళ్ల అభివృద్ధికి ఆసియా కప్‌తో పాటు ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం ఎంతో ముఖ్యం. మేం టీమిండియాతో ఆడే రోజుల్లో గొప్ప అనుభూతి కలిగేది. అలాంటి ద్వైపాక్షిక సిరీస్‌ల్లో సీనియర్ల నుంచి యువకులు నేర్చుకునే అవకాశం కూడా ఉంటుంది. సచిన్‌, గంగూలీ, అజహరుద్దీన్‌, జావెద్‌ మియాందాద్‌ ఇలా ఎవరైనా కానీ కొత్తగా జట్టులోకి వచ్చిన ఆటగాళ్లు వారి దగ్గరికెళ్లి విలువైన సలహాలు, సూచనలు తెలుసుకునేవాళ్లు. ఒక క్రికెటర్‌ తన ఆటను అత్యుత్తమంగా తీర్చిదిద్దుకొనేందుకు అదో సువర్ణ అవకాశం' అని అన్నాడు.

 తిరిగి క్రికెట్‌ జరగాలి:

తిరిగి క్రికెట్‌ జరగాలి:

తాము ఆడే రోజుల్లో భారత్‌-పాకిస్థాన్‌ జట్ల మధ్య తీవ్రమైన పోటీ ఉండేదని, అయినా చివరికి ఇరు జట్ల ఆటగాళ్లకు ఒకరంటే ఒకరు ఎంతో గౌరవించుకునే వారని ఇంజమామ్‌ గుర్తుచేసుకున్నాడు. దాయాది జట్ల మధ్య తిరిగి క్రికెట్‌ జరగాలని ఉందని, అందుకోసం తాను ఎదురుచూస్తున్నానని పేర్కొన్నాడు. 2004లో సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని భారత జట్టు పాకిస్థాన్‌ పర్యటనకు వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. అప్పుడు భారత్‌ 2-1తో టెస్టు సిరీస్‌, 3-2తో వన్డే సిరీస్‌ కైవసం చేసుకుంది. ఈ క్రమంలోనే 2005లో భారత పర్యటనకు వచ్చిన పాక్ 3-2తో వన్డే సిరీస్‌ గెలుపొందగా.. టెస్టు సిరీస్‌ను డ్రాగా ముగించింది.

 చివరిసారి 2019 వన్డే ప్రపంచకప్‌లో:

చివరిసారి 2019 వన్డే ప్రపంచకప్‌లో:

ఈ క్రమంలోనే 2005లో భారత పర్యటనకు వచ్చిన దాయాది జట్టు 3-2తో వన్డే సిరీస్‌ గెలుపొందగా టెస్టు సిరీస్‌ను డ్రాగా ముగించింది. చివరగా 2013లో ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక టీ20, వన్డే సిరీస్‌లు జరగ్గా.. పొట్టి సిరీస్‌ డ్రాగా ముగిసింది. వన్డే సిరీస్‌ 2-1 పాకిస్థాన్‌ కైవసం చేసుకుంది. అనంతరం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడంతో ఐసీసీ ఈవెంట్లలో తప్ప మరెక్కడా తలపడటం లేదు. 2019 వన్డే ప్రపంచకప్‌లో భారత్‌-పాకిస్థాన్‌ జట్లు చివరిసారిగా తలపడ్డాయి. అసియా కప్ జరగాల్సి ఉన్నా.. కరోనా కారణంగా వాయిదా పడింది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, June 11, 2021, 11:22 [IST]
Other articles published on Jun 11, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X