For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మూడు మార్పులు: పాక్ వరల్డ్‌కప్ జట్టులో పేస్ బౌలర్లు ఆమీర్, వాహబ్

Inzamam-ul-Haq confirms surprise return of Wahab Riaz in Pakistan WC squad along with Mohammad Amir, Asif Ali

హైదరాబాద్: ఐదు వన్డేల సిరిస్‌ను 4-0తో చేజార్చుకోవడంతో పాకిస్థాన్ వరల్డ్‌కప్ జట్టులో సెలక్టర్లు అనూహ్య మార్పులు చేశారు. తాజాగా సోమవారం ప్రకటించిన 15 మంది సభ్యుల్లో అంతకముందు చోటు దక్కించుకున్న ముగ్గురి ఆటగాళ్లపై వేటు వేసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మరో ముగ్గురి ఆటగాళ్లకు అవకాశం కల్పించింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ జాబితాలో పాక్ పేసర్లు మొహ‌మ్మ‌ద్ ఆమిర్‌, వాహ‌బ్ రియాజ్‌ల‌తోపాటు అసిఫ్‌ అలీకి వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కింది. వీరి స్థానంలో ఇప్పటికే చోటు దక్కించుకున్న అబిద్‌ అలీ, ఫహీమ్‌ ఆష్రఫ్‌, జునైద్‌ ఖాన్‌లపై బోర్డు వేటు వేసింది. ఈ ముగ్గురూ ఇంగ్లాండ్‌తో ఐదు వన్డేల సిరిస్‌లో పేలవ ప్రదర్శన చేశారు.

వ‌ర‌ల్డ్‌క‌ప్ కోసం ఆటగాళ్ల జాబితాను మార్చుకోవ‌డానికి మే 23వ తేదీ వ‌ర‌కు ఆయా క్రికెట్ జట్లకు అవ‌కాశం ఉంది. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు త‌న జ‌ట్టులో మార్పులు చేసింది. వరల్డ్‌కప్ ఆడబోయే తుది జట్టుపై సోమవారం లాహోర్‌లో పాక్ ఛీఫ్‌ సెలక్టర్‌ ఇంజుమామ్‌ ఉల్‌ హక్‌ మీడియాతో మాట్లాడారు.

ఇంగ్లాండ్‌తో ముగిసిన ఐదు వన్డే సిరీస్‌లో తమ ఆటగాళ్లు ఆశించినస్థాయిలో రాణించలేదని, అందుకే మేనేజ్‌మెంట్‌తో చర్చించి జట్టు కూర్పుపై మరోసారి కసరత్తు చేసినట్లు ఇంజిమామ్‌ చెప్పాడు. రివర్స్‌ స్వింగ్‌ కారణంగా వాహబ్‌ రియాజ్‌ను తుది జట్టులోకి ఎంపిక చేశామని ఇంజిమామ్‌ పేర్కొన్నాడు.

కాగా, సోమవారం వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకున్న అసీఫ్‌ అలీ రెండేళ్ల కుమార్తె నూర్ ఫాతిమా క్యాన్సర్‌తో పోరాడుతూ అమెరికాలో మరణించిన సంగతి తెలిసిందే. దీంతో ఇంగ్లాండ్‌తో ఐదు వన్డేల సిరిస్ ముగిసిన తర్వార హుటాహుటిన అసిఫ్ అలీ అమెరికాకు పయనమయ్యాడు.


వరల్డ్‌కప్‌లో ఆడే పాకిస్థాన్ జట్టు:
సర్ఫరాజ్‌ అహ్మద్‌(కెప్టెన్‌), ఫకార్‌ జమాన్‌, ఇమామ్‌ ఉల్‌ హక్‌‌, బాబర్‌ అజమ్‌, హ్యారిస్‌ సోహైల్‌, అసీఫ్‌ అలీ, షోయబ్‌మాలిక్‌, మహ్మద్‌ హఫీజ్‌, ఇమాద్‌ వసీం, షాదాబ్‌ ఖాన్‌, హసన్‌ అలీ, షాహిన్‌ అఫ్రిదీ, మహ్మద్‌ అమిర్‌, వాహబ్‌ రియాజ్‌, మహ్మద్‌ హస్‌నైన్‌

Story first published: Monday, May 20, 2019, 15:56 [IST]
Other articles published on May 20, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+