Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఢిల్లీ, ముంబైలో కోహ్లీ-అనుష్కల రిసెప్షన్ జరిగేది ఎక్కడో తెలుసా?

Invitation card, venue details of Virat Kohli-Anushka Sharma Delhi, Mumbai receptions

హైదరాబాద్: డిసెంబర్ డిసెంబర్ 11న ఇటలీలోని టస్కనీలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలకు చెందిన అతికొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరైన సంగతి తెలిసిందే.

హనీమూన్‌ కోసం విరుష్క జంట ప్రస్తుతం రోమ్‌లో పర్యటిస్తోంది. అద్భుతమైన వాతావరణం, అందమైన బీచ్‌లకు రోమ్ పెట్టింది పేరు. ఇందులో భాగంగానే హానీమూన్ కోసం వీరిద్దరూ అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పెళ్లి అనంతరం సన్నిహితులు, బంధువుల కోసం ఢిల్లీ, ముంబైలో ఇద్దరు విందు ఇవ్వనున్నారు.

డిసెంబర్ 21న ఢిల్లీలో... డిసెంబర్ 26న ముంబైలో రిసెప్షన్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ రిసెప్షన్‌కు అటు బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు క్రికెట్ ప్రముఖులు కూడా హాజరుకానున్నారు. రిసెప్షన్ల కోసం సెపరేట్‌గా ఇన్విటేషన్ కార్డును కూడా పంచిన సంగతి తెలిసిందే. రిసెప్షన్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ కూడా అయింది.

Invitation card, venue details of Virat Kohli-Anushka Sharma Delhi, Mumbai receptions

అయితే ఇప్పుడు ఢిల్లీ, ముంబైలో రిసెప్షన్ జరగనున్న ప్లేస్ వివరాలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందుకు సంబంధించిన వివరాలను కునాల్ కోహ్లీ తన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.

ఢిల్లీలో రిసెప్షన్ జరిగే ప్రదేశం: దర్బార్ హాల్, తాజ్ డిప్లమాటిక్ ఎన్‌క్లేవ్(ఎస్పీ మార్గ్ ఎన్‌ట్రేన్స్)
ముంబై రిసెప్షన్ జరిగే ప్రదేశం: అస్టోర్ బాల్‌రూమ్, సెయింట్ రెజిస్, లోయర్ పరేల్

రిసెప్షన్‌కు సంబంధించిన ఇన్విటేషన్లు పలువురు ప్రముఖులకు వెళ్లాయి. ఈ ఇన్విటేషన్‌ను విరాట్ కోహ్లీ తన అభిరుచికి తగ్గట్లుగా సింపుల్‌గా కాకుండా.. ఓ గిఫ్ట్ బాక్స్‌లాగా అతిథులకు అందజేశాడు. పెళ్లి కోసమే లంకతో ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరీస్‌ నుంచి కోహ్లీ తప్పుకోవడంతో కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్‌ శర్మకు అప్పగించారు.

ప్రస్తుతం రోమ్‌లో హనీమూన్‌ను ఎంజాయ్ చేస్తున్న కోహ్లీ-అనుష్క జోడీ ముంబై రిసెప్షన్ తర్వాత విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనున్నాడు. మరోవైపు అనుష్క శర్మ సినిమాల్లో బిజీ కానుంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, December 19, 2017, 10:56 [IST]
Other articles published on Dec 19, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+