Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆసీస్ బౌలర్లను ఊచకోత: హర్మన్ ప్రీత్ సెంచరీ ఇన్నింగ్స్ (వీడియో)

హైదరాబాద్: హర్మన్ ప్రీత్ కౌర్... ఇప్పుడు దేశ వ్యాప్తంగా మార్మోగుతున్న పేరు. ప్రపంచ మహిళా క్రికెట్‌లో తమకు తిరుగులేదని భావిస్తోన్న కంగారూల‌నే కంగారు పెట్టింది. ఆసీస్ బౌలర్లకు చెమలు పట్టించింది. బంతి ప‌డ‌ట‌మే ఆల‌స్యం.. బౌండ‌రీ లైన్ దాటించింది.

డెర్బీ వేదికగా గురువారం ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ జరగడానికి ముందు వ‌ర్షంలో త‌డిసి ముద్ద‌యిన ప్రేక్ష‌కులు.. మ్యాచ్ మొద‌లైన త‌ర్వాత హ‌ర్మ‌న్ కౌర్ ప‌రుగుల అత్యుత్తమ ఇన్నింగ్స్‌తో సంబరాలు చేసుకున్నారు. ఓపెనర్లు స్మృతి మందాన, పూనమ్ రౌత్, కెప్టెన్ మిథాలీ అవుటైన ఏమాత్రం ఒత్తిడికి గురి కాకుండా కంగారూల పని పట్టింది.

 Introducing Harmanpreet Kaur: India's new cricket superstar

115 బంతుల్లో 20 ఫోర్లు, 7 సిక్సుల సాయంతో 171 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. 64 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న హర్మన్‌ ఆ తర్వాత 51 నుంచి 100కు చేరుకోవడానికి కేవలం 26 బంతులే తీసుకుంది. సెంచరీ తర్వాత మరింత రెచ్చిపోయి 17 బంతుల్లోనే 101 నుంచి 150 పరుగులకి చేరుకుంది.

ఉమెన్ వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఇండియా త‌ర‌ఫున ఇదే అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోరు కాగా.. మొత్తంగా వన్డేల్లో రెండో అత్య‌ధిక స్కోరు కావడం విశేషం. ఈ వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో సెమీస్‌కు ముందు కౌర్ పెద్ద‌గా రాణించలేదు. అయితే చివ‌రి లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 60 పరుగులు చేసి ఫామ్‌లోకి వ‌చ్చింది.

ఆసీస్‌పై జరిగిన సెమీ ఫైనల్లో బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఇటు సెహ్వాగ్‌ను గుర్తు చేసింది. ఈ మ్యాచ్‌కు ముందు వ‌న్డేల్లో రెండు సెంచ‌రీలు చేసిన హర్మన్ ప్రీత్ కౌర్ ఇప్ప‌టివ‌ర‌కు 77 వ‌న్డేల్లో 36.55 స‌గ‌టుతో 1974 పరుగులు చేసింది. అందులో 3 సెంచ‌రీలు, 9 అర్ధ సెంచ‌రీలు ఉన్నాయి.

ఉమెన్ వరల్డ్ కప్: ఆసీస్‌పై హర్మన్ ప్రీత్ కౌర్ ఇన్నింగ్స్ మిస్ అయి ఉంటే ఇక్కడ చూడిండి

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+