Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH Team Coaching Staff List: కోచింగ్ స్టాఫ్‌ను ప్ర‌క‌టించిన SRH.. కోచ్‌లుగా దిగ్గ‌జ ఆట‌గాళ్లు

Introduced the new Coaching staff of SRH for IPL 2022.
IPL 2022: SRH Coaching Staff Ready To Rise| Brian Lara | Dale Steyn | Oneindia Telugu

స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌. 2022 ఐపీఎల్ సీజ‌న్‌కు స‌న్‌రైజ‌ర్స్ సిద్ధమవుతుంది. ఈ మేర‌కు టీమ్ మేనేజ్ రైజ‌ర్స్ కోచింగ్ స్టాఫ్‌ను ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు కోచింగ్ స్టాఫ్‌ను ప‌రిచ‌యం చేస్తూ స‌న్‌రైజ‌ర్స్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఈ సారి ఎక్కువ‌గా కొత్త వాళ్ల‌ను కోచింగ్ బృందంలోకి తీసుకుంది. అంత‌ర్జాతీయ‌ క్రికెట్‌లో సుదీర్ఘ కాలంపాటు రాణించిన దిగ్గ‌జాల‌ను ఈ సారి కోచింగ్ బృందంలో చేర్చింది స‌న్‌రైజ‌ర్స్ యాజ‌మాన్యం. గ‌తంలో రైజ‌ర్స్‌కు ఆడిన పేస్ దిగ్గ‌జం డేల్ స్టెయిన్‌తోపాటు వెస్టిండీస్ దిగ్గ‌జ ఆట‌గాడు బ్రియ‌న్ లారా కూడా ఈ సారి స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ కోచింగ్ స్టాఫ్‌లో భాగం కానున్నారు.

బ్యాటింగ్ కోచ్‌గా వెస్టిండీస్ గ్రేట్ ప్లేయ‌ర్‌

స‌న్‌రైజ‌ర్స్ హెడ్‌కోచ్‌గా చాలా కాలంగా ఉన్నా టామ్ మూడీనే ఈ సారి కూడా ఆ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తించ‌నున్నాడు. టామ్ మూడీ కోచింగ్‌లో స‌న్‌రైజ‌ర్స్ విజ‌యంతంగా రాణిస్తోంది. టామ్ మూడీ కోచింగ్‌లో 5 సార్లు ఫ్లే ఆప్స్ చేరిన హైద‌రాబాద్ జ‌ట్టు 2016లో ట్రోఫీ కూడా నెగ్గింది. మ‌రోసారి ర‌న్న‌రఫ్‌గా నిలిచింది. రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూర్ జట్టు మాజీ హెడ్ కోచ్ అయినా సైమన్ కటిచ్ అసిస్టెంట్ కోచ్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. అంత‌ర్జాతీ క్రికెట్‌లో 22 వేల‌కు పైగా ప‌రుగులు చేసిన వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గ‌జం బ్రియాన్ లారా బ్యాటింగ్ కోచ్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. అలాగే హేమంగ్ బదానీ ఫీల్డింగ్ కోచ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నాడు.

బౌలింగ్ కోచ్‌గా పేస్ దిగ్గ‌జం

బౌలింగ్ కోచ్‌గా పేస్ దిగ్గ‌జం

ద‌క్షిణాఫ్రికాకు చెందిన పేస్ బౌలింగ్ దిగ్గ‌జం డేల్ స్టెయిన్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ పేస్ బౌలింగ్ కోచ్‌గా నియామ‌కం అయ్యాడు. కాగా అంత‌ర్జాతీయ క్రికెట్‌లో డేల్ స్టెయిన్ 699 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఐపీఎల్‌లోనూ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, డెక్క‌న్ చార్జ‌ర్స్‌, రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌ర‌ఫున ఆడి 97 వికెట్లు తీసుకున్నాడు. ఇక స్పిన్ బౌలింగ్ కోచ్‌గా శ్రీ‌లంక లెజెండ్ ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ కొన‌సాగ‌నున్నాడు. ముర‌ళీధ‌ర‌న్ గ‌తంలో కూడా స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టు స్పిన్ కోచ్‌గా ఉన్నాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అత్య‌ధిక వికెట్లు తీసింది ముత్త‌య్య ముర‌ళీద‌ర‌నే అనే సంగ‌తి తెలిసిందే.

ట్రోఫీనే ల‌క్ష్యంగా బ‌రిలోకి

ట్రోఫీనే ల‌క్ష్యంగా బ‌రిలోకి

ఐపీఎల్ గ‌త సీజ‌న్‌లో తీవ్రంగా నిరాశ‌ప‌రిచిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు ఈ సారి మాత్రం ట్రోఫీ గెల‌వ‌డ‌మే ల‌క్ష్యంగా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటుంది. ఈ సారి కూడా కేన్ విలియ‌మ్స‌నే రైజ‌ర్స్ జ‌ట్టును న‌డిపించ‌నున్నాడు. కాగా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు ఈ సారి కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్‌తోపాటు అబ్దుల్ స‌మ‌ద్‌, ఉమ్రాన్ మాలిక్‌ను రిటైన్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇందుకుగాను విలియ‌మ్స‌న్‌కు 14 కోట్ల రూపాయ‌లు, స‌మ‌ద్‌, ఉమ్రాన్‌కు చెరో 4 కోట్ల రూపాయ‌ల చొప్పున చెల్లించ‌నుంది. ఇక వేలంలో జాగ్ర‌త్తగా వ్య‌వ‌హ‌రించి స‌రైన ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేయాల‌ని స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ యాజ‌మాన్యం భావిస్తోంది.

Story first published: Thursday, December 23, 2021, 14:19 [IST]
Other articles published on Dec 23, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+