కొత్తగా ఆడేవారిపై ప్రభావం: భారత్-పాక్ మ్యాచ్‌పై విరాట్ కోహ్లీ

హైదరాబాద్: ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్ తమ ఆటగాళ్లలో అత్యుత్తమ ఆటను వెలికితీస్తుందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని కోహ్లీ పేర్కొన్నాడు. టోర్నీలో భాగంగా గురువారం భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ
ఈ మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ "పాకిస్థాన్‌తో మ్యాచ్ అంటే చాలా పోటాపోటీగా సాగుతుంది. చాలా ఏళ్లుగా ఇది జరుగుతోంది. ఆ జట్టుతో పోరు మా అందరిలో అత్యుత్తమ ఆటను వెలికితీస్తుంది. మేం మైదానంలోకి వెళ్లగానే అంతా ప్రశాంతంగా మారిపోతుంది. ఒత్తిడి, ఆందోళన లాంటి భావోద్వేగాలు కొత్తగా ఆడేవారిపై ప్రభావం చూపుతాయి" అని అన్నాడు.

కివీస్‌తో మ్యాచ్ వర్షార్ఫణం కావడంపై
ఇక, కివీస్‌తో మ్యాచ్ వర్షార్ఫణం కాడవంపై " ఇది చాలా సున్నితమైన నిర్ణయం. ఔట్‌ఫీల్డ్ అనుకూలంగా లేనప్పుడు మనం మాత్రం ఏం చేయగలం. చిత్తడి మైదానంలో ఫీల్డర్లకు గాయాలయ్యే అవకాశాలెక్కువ. దానికన్నా ఆట రద్దు కావడమే మంచింది. శిఖర్ గాయం త్వరగా నయం కావాలని కోరుకుంటున్నా. టోర్నీ మలి సగంలో అతడు అందుబాటులో ఉండే అవకాశాలున్నాయి. అతడు జట్టుతో చేరాలని మేము కోరుకుంటున్నాం" అని విరాట్ కోహ్లీ అన్నాడు.

కేన్ విలియమ్సన్ మాట్లాడుతూ
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మాట్లాడుతూ "గత నాలుగు రోజులుగా ఇక్కడ సూర్యుడే కనిపించలేదు. అందుకే ఈ నిర్ణయం మమ్మల్ని ఆశ్చర్యపర్చలేదు. దీంతో టోర్నీ మధ్యలో మాకు సుదీర్ఘ విరామం దొరికింది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు రీఫ్రెష్ అయ్యేందుకు ఈ సమయాన్ని వినియోగించుకుంటాం" అని అన్నాడు.

పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో భారత్
ఈ టోర్నీలో టీమిండియా రెండు వరుస విజయాలు సాధించగా గురువారం న్యూజిలాండ్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో ఏడు పాయింట్లతో న్యూజిలాండ్ అగ్రస్థానంలో ఉండగా... ఐదు పాయింట్లతో భారత్ మూడోస్థానంలో కొనసాగుతోంది. ఇక, పాక్ నాలుగు మ్యాచ్‌లకు గాను రెండింట ఓడి, పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications