
సచిన్ మెళకువలు..
ముంబైలోని టెండూల్కర్ మిడిలెక్స్ గ్లోబల్ అకాడమీలో షాహిద్‌కు సచిన్ దగ్గరుండి మెళకువలు నేర్పించాడు. అతడికి కొన్ని టిప్స్ కూడా చెప్పి సంతకం చేసిన ఓ బ్యాట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. ‘మేం అప్లోడ్ చేసిన వీడియో చూసిన సచిన్ సర్ మమ్మల్ని ముంబైకి ఆహ్వానించారు. ఐదు రోజుల పాటు అకాడమీలో షాహిద్‌కు క్రికెట్ ట్రైనింగ్ ఇప్పించారు.
బ్యాక్ ఫుట్, ఫ్రంట్ ఫుట్‌లో ఎలాంటి షాట్స్ ఆడాలో చూపించారు. క్యాచ్‌లు ఎలా పట్టాలో నేర్పారు. షాహిద్‌లో ఎంతో ప్రతిభ ఉందని మెచ్చుకున్నారు. సచిన్ సర్ చేసిన దానికి కేవలం కృతజ్ఞతలు చెబితే సరిపోదు'అని షాహిద్ తండ్రి షేక్ షంషేర్ తెలిపాడు.
|
సెలూన్ వర్కర్‌గా..
షాహిద్ తండ్రి షేక్ షంషేర్ హెయిర్ సెలూన్లో వర్కర్‌గా పని చేస్తూ జీవినం సాగిస్తున్నాడు. రెండేళ్ల క్రితం తన కొడుకు బ్యాటింగ్ ప్రాక్టీస్‌కు సబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. డైపర్ వేసుకున్న బుడ్డొడూ అచ్చం టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తరహాలో కవర్ డ్రైవ్స్ షాట్స్ ఆడాడు. దాంతో ఆ వీడియో క్రికెట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ క్రికెటర్లు కూడా ఆ బుడ్డోడు టాలెంట్‌ను చూసి ఆశ్చర్యపోయారు. ఇటీవల గుండెపోటుకు గురైన షేన్ వార్న్ సైతం అప్పట్లో ఈ బుడ్డోడిని మెచ్చుకున్నాడు. క్రికెట్లో అతనికి మంచి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించాడు.

సొంత ఖర్చులతో..
సచిన్ టెండూల్కర్ సైతం ఈ వీడియోను చూసే షాహిద్ ఆటతీరుకు ఫిదా అయ్యాడు. అప్పట్లోనే అతన్ని మెచ్చుకున్నాడు. తాజాగా అతనికి స్పెషల్ ట్రైనింగ్ ఇప్పించాడు. వారిని ముంబైకి రప్పించి.. తన గెస్ట్ హౌస్‌లో ఏర్పాట్లు మరి షాహిద్‌కు ఐదు రోజుల ట్రైనింగ్ ఇప్పించాడు. పూర్తి ఖర్చులు సచినే భరించాడు. ఆస్ట్రేలియా చానెల్ ఫాక్స్ స్పోర్ట్స్ ఈ డైపర్ బాలుడి బ్యాటింగ్ ప్రాక్టీస్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. సచిన్, వార్న్, మైకేల్ వాన్లను ట్యాగ్ చేసింది. దాంతో ఆ బుడ్డోడు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు. బ్రెట్ లీ, మైకేల్ వాన్ వంటి దిగ్గజ ఆటగాళ్లు సైతం ఈ బుడ్డోడి ప్రతిభకు ఫిదా అయ్యారు.