Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsBAN: నిన్నటి దాకా వేస్ట్ అన్నోళ్లే.. ఇప్పుడు సలాం కొడుతున్నారుగా..!

Internet goes crazy after Shubman Gill slams his first Test ton

ఒక్క రోజు క్రితం వరకు అసలతను వేస్ట్, అలాంటి వాడికి టీమిండియాలో ఛాన్సులు ఇవ్వడం దేనికి? ఇచ్చిన ఒక్క అవకాశాన్ని కూడా యూజ్ చేసుకోలేని వేస్ట్ బ్యాటర్ అంటూ తిట్టిన నోళ్లే ఇప్పుడు అతనో అద్భుతం అంటూ సలాం కొడుతున్నాయి. అతని ఆటతీరు చూసి నోరెళ్లబెడుతున్నాయి. అతనే టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్.

తొలి ఇన్నింగ్స్‌లో ఫెయిల్..

తొలి ఇన్నింగ్స్‌లో ఫెయిల్..

బంగ్లాతో తొలి టెస్టుకు గాయంతో రోహిత్ శర్మ దూరం అవడంతో గిల్‌కు మరోసారి అవకాశం దక్కింది. మొదటి ఇన్నింగ్స్‌ను చక్కగా ప్రారంభించిన గిల్.. తన వైట్ బాల్ ఫామ్‌ను కొనసాగిస్తున్నట్లే కనిపించాడు. కానీ సడెన్‌గా ఒక చెత్త షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. అంతే.. నెటిజన్లు మండిపడ్డారు. లేక లేక వచ్చిన అవకాశాన్ని ఇలా కాలరాస్తావా? ఎన్ని అవకాశాలు వేస్టే చేసుకుంటావురా? అంటూ నెట్టింట ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటన్నింటినీ గిల్ పట్టించుకోలేదు. ఫీల్డింగ్‌లో చురుకుగా కదులుతూ.. అద్భుతమైన క్యాచ్‌ అందుకొని తొలి ఇన్నింగ్స్‌‌లో తన బ్యాటింగ్ వైఫల్యాన్ని అందరూ మర్చిపోయేలా చేశాడు.

 రెండో ఇన్నింగ్స్‌లో దుమ్ములేపాడు..

రెండో ఇన్నింగ్స్‌లో దుమ్ములేపాడు..

తనను తిట్టిన వాళ్ల నోళ్లు మూయించాలనే పట్టుదలతో ఆడాడేమో తెలియదు కానీ.. రెండో ఇన్నింగ్స్‌లో గిల్ ఆటతీరు చూడచక్కగా సాగింది. వేగంగా ఆడి జట్టుకు భారీ స్కోరు అందించడమే లక్ష్యంగా ఆడాడతను. ఆరంభంలో రాహుల్ నెమ్మదిగా ఆడి అవుటైన తర్వాత తను వేగం పెంచాడు. పుజారాతో కలిసి రెండో వికెట్‌గా భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా తన తొలి టెస్టు శతకం నమోదు చేశాడు. చాలా రోజుల తర్వాత తనకు వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు.

ఇది ఆరంభం మాత్రమే..

ఇది ఆరంభం మాత్రమే..

గిల్ ఇన్నింగ్స్ చూసిన ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. నెటిజన్లు కూడా గిల్ తొలి సెంచరీని ఎంజాయ్ చేశారు. మాజీ క్రికెటర్ వసీం జాఫర్ కూడా గిల్ ఆటతీరును మెచ్చుకుంటూ ట్వీట్ చేశాడు. 'అవకాశాలు తక్కువగా ఉన్నప్పుడు.. ఇదిగో ఇలాగే వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవాలి.

తొలి టెస్టు సెంచరీ చేసినందుకు శుభాకాంక్షలు గిల్' అని ట్వీట్ చేశాడు. క్రీడాలోకం కూడా అతని సెంచరీని మెచ్చుకుంది. 'ఇది గిల్ కెరీర్‌ ఆరంభం మాత్రమే.. తర్వాత ఉంటుంది అసలు కథ' అంటూ తెగ పొగిడేస్తున్నారు. బంగ్లాతో టెస్టులో ఛటేశ్వర్ పుజారా కూడా తన టెస్టు శతకం వెయిటింగ్‌కు పుల్‌స్టాప్ పెట్టేయడంతో భారత అభిమానుల ఆనందం రెట్టింపయిందని చెప్పొచ్చు.

Story first published: Friday, December 16, 2022, 21:12 [IST]
Other articles published on Dec 16, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+