న్యూఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఏదో సందేశం ఇస్తారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆ జాబితాలో టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా చేరిపోయాడు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విరాట్ కోహ్లీ.. మహిళలకు శుభాకాంక్షలు తెలిపాడు. అంతేగాక, మహిళలను వేధింపులకు, ఇబ్బందులకు గురిచేస్తున్న వారిని ఉద్దేశిస్తూ మహిళలను క్షమాపణలు కోరాడు.

'కొందరు మహిళలను ఇబ్బందులకు, వేధింపులకు గురిచేస్తున్నందుకు క్షమాపణలు కోరుతున్నా. వారితో మిగిలిన వారందరినీ పోల్చవద్దు. మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు' అని ట్విట్టర్ ద్వారా కోహ్లీ వ్యాఖ్యానించాడు.
విరాట్ కోహ్లీతోపాటు బాలీవుడ్ నటులు షారుక్ ఖాన్, శిల్పా శెట్టి, ఫరాఖాన్, పర్హాన్ అక్తర్ లాంటి చాలా మంది ట్విట్టర్ ద్వారా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని వాస్తవంగా అంతర్జాతీయంగా వర్కింగ్ మహిళా దినోత్సవం అని పిలుస్తారు. ప్రతి ఏడాది మార్చి 8న ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు.