
వాళ్లే లేకపోతే తానేమయ్యేవాడినో:
మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తన జీవితంలో అత్యంత కీలకమైన ఐదుగురు మహిళలను ఆయన గుర్తు చేసుకున్నారు. వాళ్లే లేకపోతే తానేమయ్యేవాడినో తనకే తెలియదన్నారు. ట్విట్టర్ వేదికగా ఓ వీడియో పోస్ట్ చేసి ఐదుగురు మహిళ గురించి వివరించారు. తన తల్లి, చిన్నప్పుడు తనను క్రికెట్ వైపుగా ప్రోత్సహించిన ఆంటీ, తన భార్య అంజలి, ఆమె తల్లి, తన కూతురు సారాలు తన జీవితంలో అత్యంత కీలకమైన మహిళలు అని సచిన్ చెప్పారు.

అమ్మ ఎంతో శ్రద్ధ చూపేవారు:
సచిన్ తన తల్లి గురించి మాట్లాడుతూ... 'నా ఆరోగ్యం పట్ల మా అమ్మ ఎంతో శ్రద్ధ చూపేవారు. మరీ ముఖ్యంగా ఆహరం విషయంలో. ఆరోగ్యంగా ఉండటంతో పాటు సంతోషంగా ఉండేలా నన్ను చూసుకున్నారు' అని తెలిపారు. ' క్రికెట్ కెరీర్ ప్రారంభించిన తొలి రోజులలో తెలిసిన ఆంటీ వాళ్ల ఇంట్లో వాడిని. నాలుగు సంవత్సరాలు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. స్టేడియంకు దగ్గరలో ఆంటీ వాళ్ల ఇల్లు ఉండేది. నాతొ పాటు ఆంటీ కూడా స్టేడియంకు వచ్చేవారు. ఆమె మరో అమ్మ' అని సచిన్ పేర్కొన్నారు.

సారా మూలాలను మర్చిపోకుండా:
'నా భార్య అంజలి ఇంటి పనులను చక్కబెట్టడంలో ముందుంటుంది. ఇప్పటికే తనే అన్నిటిని చూసుకుంటుంది. అంజలి వాళ్ల అమ్మ కూడా నాకు మంచి సలహాలు, సూచనలు చేసేవారు. నా కూతురు సారా తన మూలాలను మర్చిపోకుండా.. నేటి తరానికి తగ్గట్టుగా ఉంటుంది. తనను తాను చక్కగా సమన్వయం చేసుకుంటుంది' అని సచిన్ చెప్పుకొచ్చారు.
సచిన్‌పై బాక్సింగ్ పంచ్‌లు:
రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో భాగంగా ఇండియా లెజెండ్స్ తరఫున సచిన్ టెండూల్కర్-ఇర్ఫాన్ పఠాన్‌లు ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు ఇర్ఫాన్ పఠాన్ తన కుమారుడితో పాటు హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఓ సరదా సన్నివేషం చోటుచేసుకుంది. ఇర్ఫాన్ కుమారుడు ఇమ్రాన్ ఖాన్ క్రికెట్ దిగ్గజం సచిన్‌తో బాక్సింగ్ చేశాడు. ఓ టేబుల్‌పై నిల్చున్న ఇమ్రాన్.. సచిన్ కంటే తానే ఎత్తుగా ఉన్నానంటూ చెప్పాడు. అంతేకాదు తన కండలు చూపిస్తూ.. సచిన్‌పై బాక్సింగ్ పంచ్‌లు విసిరాడు. ఇమ్రాన్ అమాయకత్వంతో చేస్తున్న పనికి సచిన్ మురిసిపోయాడు.


Click it and Unblock the Notifications
