Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రాంచీలో మూడో వన్డే: మహిళా దినోత్సవం రోజున ఎడుల్జీకి అరుదైన గౌరవం

International Womens Day: Diana Edulji To Present Coin At Toss During India vs Australia 3rd ODI

హైదరాబాద్: మార్చి 8. అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ అద్భుతమైన రోజున భారత మాజీ క్రికెటర్, బీసీసీఐ పాలకుల కమిటీలో సభ్యురాలైన డయానా ఎడుల్జీని బీసీసీఐ అరుదైన గౌరవాన్ని కల్పించింది. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా రాంచీ వేదికగా భారత్‌-ఆస్ట్రేలియాల మధ్య శుక్రవారం మూడో వన్డే ప్రారంభమైంది.

ఈ మ్యాచ్‌లో టాస్ వేసే కాయిన్‌ను డయానా ఎడుల్జీ తీసుకువ్చారు. టాస్ కాయిన్‌ను ఆమె కెప్టెన్ విరాట్ కోహ్లీకి అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ "మహిళా దినోత్సవం సందర్భంగా ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన భారత క్రికెట్‌కు ధన్యవాదాలు" అని అన్నారు.

మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

"మహిళా క్రికెట్‌కు మరింత వృద్ధి చెందేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా ప్రామిస్‌ చేస్తున్నాను. దేశవ్యాప్తంగా ఎంతోమంది అమ్మాయిలు రాబోయే రోజుల్లో క్రికెట్‌ రంగాన్ని ఎంచుకుంటారని ఆశిస్తున్నాను. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో పాటు సమానంగా రాణిస్తున్నారు. భారత మహిళల జట్టు కూడా రాణిస్తోంది. దేశంలోని మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు" అని ఎడుల్జీ అన్నారు.

పింక్ బెలూన్లను వదిలిన డయానా ఎడుల్జీ

అంతకముందు మహిళా దినోత్సవం సందర్భంగా మ్యాచ్ ప్రారంభానికి ముందు డయానా ఎడుల్జీ ఆకాశంలోకి పింక్ బెలూన్లను వదిలారు. ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ తన ట్విట్టర్‌‌లో అభిమానులతో పంచుకుంది.

స్పెషల్ ‘ఆర్మీ' క్యాప్ ధరించి

కాగా, మూడో వన్డేలో భారత్ ఆటగాళ్లు స్పెషల్ ‘ఆర్మీ' క్యాప్ ధరించి మ్యాచ్ ఆడుతున్నారు. పుల్వామా ఉగ్ర‌దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమ‌ర జ‌వాన్ల‌కు నివాళిగా ఆర్మీ క్యాప్‌లను భారత జట్టులోని ఆటగాళ్లు ధరించారు. బీసీసీఐ లోగోతో ప్రత్యేకంగా రూపొందించిన ఈ క్యాప్‌లను భారత ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ (గౌరవ) హోదాలో ఉన్న మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లకి అందజేశారు.

కోహ్లీ మాట్లాడుతూ

ఈ స్పెషల్ క్యాప్‌పై విరాట్ కోహ్లీ మాట్లాడుతూ "దేశ రక్షణలో అమరులైన జవాన్ల కుటుంబాలకు ఏం చేసినా రుణం తీర్చుకోలేం. పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలి. మూడో వన్డేలో మాకు రానున్న ఫీజు మొత్తాన్ని నేష‌న‌ల్ డిఫెన్స్ ఫండ్‌కు విరాళంగా ఇస్తాం. దేశం కోసం ప్రతి ఒక్కరూ వారికి చేతనైన సేవ చేయాలని నేను కోరుతున్నా. జవాన్ల కుటుంబాలకు మనం మద్దతుగా నిలవాలి"అని అన్నాడు. ఈ నిధులను పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జ‌వాన్ల పిల్ల‌ల చ‌ద‌ువు కోసం వినియోగించనున్నారు.

కామెంటేటర్లు సైతం

కాగా, ఈ ప్రత్యేకమైన ఆర్మీ క్యాప్‌లను మూడో వన్డేకి కామెంటేటర్లుగా వ్యవహారిస్తోన్న వారికి భారత మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అందజేశారు. కామెంటేటర్లు హర్షా భోగ్లే, మురళీ కార్తీక్, మాథ్యూ హెడెన్‌లతో పాటు సంజయ్ మంజ్రేకర్‌లకు సునీల్ గవాస్కర్ తన చేతుల మీదుగా ఈ క్యాప్‌లను అందజేశాడు.

Story first published: Friday, March 8, 2019, 14:58 [IST]
Other articles published on Mar 8, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+