
హైదరాబాద్: ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు ఈ ఏడాది మరిచిపోలేని సంవత్సరం. ఈ క్యాలెండర్ ఇయర్‌లో స్టీవ్ స్మిత్ 1000 పరుగులు నమోదు చేశాడు. ఈ ఘనత సాధించిన స్టీవ్ స్మిత్ వరుసగా ఇది నాలుగో సంవత్సరం కావడం విశేషం. ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకుల్లో స్టీవ్ స్మిత్ అగ్రస్ధానంలో కొనసాగుతున్నాడు.
ఇదిలా ఉంటే పెర్త్ టెస్టులో పర్యాటక ఇంగ్లాండ్ జట్టుపై ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 41 పరుగుల తేడాతో విజయం సాధించి మరో రెండు టెస్టులు మిగిలుండగానే యాషెస్ సిరిస్‌ను చేజిక్కించుకున్నాడు. దీంతో బ్యాటింగ్ ర్యాంకుల్లో దిగ్గజ బ్యాట్స్‌మెన్ డాన్ బ్రాడ్‌మన్ సాధించిన అత్యధిక పాయింట్లకు స్మిత్ మరింత చేరువయ్యాడు.
మంగళవారం ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో స్మిత్ 945 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రికీ పాంటింగ్ (942), పీటర్ మే, జాక్ హోబ్స్ (942) పాయింట్లను అధిగమించిన స్టీవ్ స్మిత్ తాజాగా ఆసీస్ క్రికెట్ లెజెండ్ బ్రాడ్‌మన్ సాధించిన ఆల్ టైం అత్యధిక పాయింట్లకు కేవలం 16 పాయింట్ల దూరంలో నిలిచాడు.
1948లో బ్రాడ్‌మన్ 961 పాయింట్లు సాధించాడు. టెస్టు పాయింట్లలో ఇప్పటికీ అదే అత్యుత్తమం. అయితే ఇటీవల కాలంలో స్టీవ్ స్మిత్ రోజు రోజుకూ అద్బుత ప్రదర్శన చేస్తూ, బ్రాడ్‌మన్ రికార్డుకు చేరువయ్యాడు.
టెస్టుల్లో స్టీవ్ స్మిత్ యావరేజి 62.32గా ఉంది. బ్రాడ్‌మన్ (99.94) యావరేజి తర్వాత ఇదే అత్యధికం.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.