
హైదరాబాద్: మైదానంలో తన ఆటతీరుతో కంటే మైదానం బయట ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఎక్కువగా పాపులర్ అయ్యాడు. బ్రిస్టల్ నైట్ క్లబ్‌లో జరిగిన గొడవ కారణంగా ఈ ఏడాది బెన్ స్టోక్స్ బాగా ప్రాచుర్యం పొందాడు. ఈ గొడవ కారణంగా ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరిస్ నుంచి బెన్ స్టోక్స్‌ని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు సస్పెండ్ చేసింది.
ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో బెన్ స్టోక్స్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. పెర్త్‌లోని వాకా స్టేడియంలో జరిగిన మూడో టెస్టులో పర్యాటక ఇంగ్లాండ్ జట్టుపై ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌ను మరో రెండు టెస్టులు మిగిలుండగానే ఆస్ట్రేలియా 3-0తో కైవసం చేసుకుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.