For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Masters League 2024: ఇండియా కెప్టెన్‌గా సచిన్.. పూర్తి షెడ్యూల్ ఇదే!

సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా వంటి దిగ్గజ క్రికెటర్లు తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నారు. అంతర్జాతీయ మాస్టర్ లీగ్ తొలి సీజన్‌లో ఆడనున్నారు. ఈ టోర్నీలో భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్‌ జట్లకు చెందిన మాజీ ఆటగాళ్లు ఆయా దేశాల తరఫున ఈ టోర్నీలో పాల్గొనున్నారు.

ఇండియా మాస్టర్స్‌ పేరుతో బరిలోకి దిగినున్న భారత జట్టుకు సచిన్ టెండూల్కర్ సారథి బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. అలాగే శ్రీలంకకు కుమార సంగక్కర, ఆస్ట్రేలియాకు షేన్ వాట్సన్, ఇంగ్లండ్‌కు ఆయాన్ మోర్గాన్, వెస్టిండీస్‌కు బ్రియాన్ లారా, సౌతాఫ్రికాకు జాక్వెస్ కలిస్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు.

International Masters League 2024 Teams Captains Schedule Venues and Full Fixture List

అంతర్జాతీయ మాస్టర్స్‌ లీగ్‌ తొలి సీజన్‌ నవంబరు 17 నుంచి డిసెంబరు 8 వరకు జరగనుంది. ముంబై, లక్నో, రాయ్‌పుర్‌ నగరాల్లో ఈ టోర్నీ నిర్వహించనున్నారు. సెమీఫైనల్స్, ఫైనల్స్ రాయ్‌పుర్ వేదికగా జరగనుంది. భారత్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభం కానుంది. అన్ని మ్యాచ్‌లు రాత్రి 7.30 గంటలకు మొదలుకానున్నాయి.

ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ షెడ్యూల్
నవంబర్ 17- ముంబై: భారత్ వర్సెస్ శ్రీలంక
నవంబర్ 18- ముంబై: ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా
నవంబర్ 19- ముంబై: శ్రీలంక వర్సెస్ ఇంగ్లండ్
నవంబర్ 20- ముంబై: వెస్టిండీస్ వర్సెస్ ఆస్ట్రేలియా

నవంబర్ 21- లక్నో: భారత్ వర్సెస్ సౌతాఫ్రికా
నవంబర్ 23- లక్నో: ఇంగ్లండ్ వర్సెస్ సౌతాఫ్రికా
నవంబర్ 24- లక్నో: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా
నవంబర్ 25- లక్నో: వెస్టిండీస్ వర్సెస్ శ్రీలంక
నవంబర్ 26- లక్నో: ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియా

నవంబర్ 27- లక్నో: వెస్టిండీస్ వర్సెస్ సౌతాఫ్రికా
నవంబర్ 28- రాయ్‌పుర్: భారత్ వర్సెస్ ఇంగ్లండ్
నవంబర్ 30- రాయ్‌పుర్: శ్రీలంక వర్సెస్ సౌతాఫ్రికా
డిసెంబర్ 01-రాయ్‌పుర్: భారత్ వర్సెస్ వెస్టిండీస్
డిసెంబర్ 02- రాయ్‌పుర్: శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా

డిసెంబర్ 03- రాయ్‌పుర్: వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లండ్
డిసెంబర్ 05- రాయ్‌పుర్: సెమీఫైనల్-1
డిసెంబర్ 06- రాయ్‌పుర్: సెమీఫైనల్-2
డిసెంబర్ 08- రాయ్‌పుర్: ఫైనల్.

Story first published: Wednesday, October 9, 2024, 14:18 [IST]
Other articles published on Oct 9, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+