
క్రికెట్ ఆస్ట్రేలియాతో సహా వివిధ బోర్డులతో సంప్రదింపులు
6 జట్లతో కూడిన ILT20 తొలి ఎడిషన్... దక్షిణాఫ్రికాలో కొత్త T20 లీగ్, ఆస్ట్రేలియా యొక్క బిగ్ బాష్ లీగ్ మరియు బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లు జరిగే సమయంలోనే జరగబోతుంది. డిసెంబర్ 13 నుండి ఫిబ్రవరి 12మధ్య జరిగే బీబీఎల్ జరగనుంది. అదే టైంలో యూఏఈ టీ20 లీగ్ కూడా ఉండడంతో క్రికెట్ ఆస్ట్రేలియా తమ స్టార్ ప్లేయర్లను బీబీఎల్లో ఆడించడానికి పెద్ద మొత్తాలను ఆఫర్ చేస్తోంది. ఇకపోతే ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ప్రధాన కార్యదర్శి ముబాష్షీర్ ఉస్మానీ మాట్లాడుతూ.. ఐఎల్ టీ20 లీగ్‌ను జనవరి 6 నుంచి ఫిబ్రవరి 12వరకు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ టైంలో ఆడేందుకు UAEలో సరైన పరిస్థితులు ఉంటాయి. ఇక ఇదే టైంలో డేట్ క్లాష్‌లను తగ్గించడానికి మేము వివిధ బోర్డులతో కలిసి పని చేస్తున్నాం.మేము క్రికెట్ ఆస్ట్రేలియాతో పాటు సంబంధిత క్రికెట్ బోర్డులతో టచ్‌లో ఉన్నాం. లీగ్‌లో ఆస్ట్రేలియన్లతో పాటు అందుబాటులో ఉన్న ఇతర ఆటగాళ్లు కూడా పాల్గొనాలని మేము కోరుకుంటున్నాం' అని తెలిపాడు.

మొయిన్ అలీ, డేవిడ్ మలన్ లాంటి మార్క్యూ ప్లేయర్లు
ఇకపోతే ILT20 ప్రకటించిన మార్క్యూ ప్లేయర్లలో ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్లు మొయిన్ అలీ, డేవిడ్ మలన్, క్రిస్ జోర్డాన్ ఉన్నారు. అలాగే వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్, ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ ఉన్నారు. విదేశీయులతో సంతకం చేసే అధికారం ఫ్రాంచైజీలకు ఇప్పటికే ఇచ్చినట్లు ఉస్మానీ తెలిపారు. అందుకు ఆటగాళ్లకు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు సహాయం చేయడానికి సిద్ధంగా ఉందన్నాడు. ఇక లీగ్ ప్రారంభ ఎడిషన్‌లో పాల్గొనేందుకు అవసరమైన అన్ని అనుమతులను అందించడానికి మా బృందం ఆటగాళ్లకు, ఆటగాళ్ల ఏజెంట్లకు, వివిధ బోర్డులకు సహకారం అందిస్తుందని ఉస్మానీ తెలిపాడు.

జట్టులో ఏకంగా 9మంది విదేశీ ప్లేయర్లు..!
ILT20లో మొత్తం ఆరు జట్లు ఆడనున్నాయి. జట్లలో ఎక్కువగా ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ప్లేయర్ల కంటే విదేశీ ప్లేయర్లే ఉంటారు. అయితే ప్రతి ప్లేయింగ్ XIలో ఇద్దరు స్థానిక ఆటగాళ్లు తప్పనిసరిగా ఉండాలి. అంటే 9మంది విదేశీ ఆటగాళ్లు.. ఇద్దరు యూఏఈ ఆటగాళ్లు జట్టులో ఉంటారన్న మాట. ఉస్మానీ మాట్లాడుతూ.. ఐఎల్‌టీ20 లీగ్ చాలా 'ప్రత్యేకమైనది' అని పేర్కొన్నాడు. ఇది యూఏఈ మరియు ఇతర అసోసియేట్ దేశాల నుండి ఆటగాళ్లకు అంతర్జాతీయ స్థాయి ఆటను అందించడంతో పాటు.. అగ్రశ్రేణి ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకునే అవకాశం కూడా దక్కనుంది అని పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications
