హైదరాబాద్: భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె డ్రెస్సింగ్ సెన్స్‌పై నెటిజన్లు ట్విట్టర్ వేదికగా ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు బుధవారం ఆమె పోస్టు చేసిన ఫోటోను కూడా తొలగించాలంటూ కామెంట్ పోస్టు చేశారు.
అసలేం జరిగింది?
మిథాలీ తన స్నేహితులతో కలిసి దిగిన ఓ ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఫొటోలో అందరి దుస్తులు బాగానే ఉన్నాయి కానీ మిథాలీ వేసుకున్న దుస్తులు చూసేందుకు కాస్త అసభ్యకరంగా ఉన్నాయి. ఈ ఫోటోను చూసిన నెటిజన్లకు ఇది ఎంత మాత్రం నచ్చలేదు.

దీంతో నెటిజన్లు మాత్రం ఫోటోలో మిథాలి డ్రెస్స్ బాలేదని, ఫోటోను తొలిగించాలని సూచిస్తున్నారు. 'డిలీట్ చేయండి మేడమ్. మిమ్మల్ని ఎందరో స్ఫూర్తిగా తీసుకుంటారు.కానీ మీరు వేసుకున్న దుస్తులు బాలేవు' అంటూ ఓ నెటిజన్ స్పందించాడు. మరో నెటిజన్ 'నువ్వు మహిళల టీమిండియా కెప్టెన్‌వి. సినిమా సెలబ్రిటీవి కావు. ఈ ఫొటో డిలీట్ చేసెయ్' అంటూ ఘాటుగా స్పందించాడు.
'మీ నుంచి ఇలాంటివి వూహించలేదు. మీపై మీకు ఎలాగో గౌరవం లేదు. కనీసం అభిమానులకు మీపై ఉన్న గౌరవాన్నైనా నిలబెట్టుకోండి' అని మరొక నెటిజన్ స్పందించగా... ఇక్కడి ప్రజల గురించి తెలిసి కూడా అలాంటి ఫోటోను షేర్ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ కామెంట్స్‌పై మిథాలి స్పందించక పోవడం విశేషం.
అయితే కొందరు మాత్రం మిథాలీకి మద్దతుగా ట్వీట్లు చేశారు. ఆమె డ్రెస్ ఆమె ఇష్టం.. ముందు నువ్వు ట్వీట్ డిలిట్ చేసి నీ మెంటాలిటీ మార్చుకో అంటూ సలహా ఇవ్వడం విశేషం.
గతంలో కూడా ఓ కార్యక్రమంలో మిథాలీ వేసుకున్న డ్రెస్‌పై ట్విట్టర్‌లో ఇలాగే చర్చ నడిచిన సంగతి తెలిసిందే. భారత జట్టు మహిళల కెప్టెన్‌గా 2017 వరల్డ్‌కప్‌లో ఆమె జట్టుని ఫైనల్‌కు చేర్చింది. ఇదే టోర్నీలో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఉమన్ క్రికెటర్‌గానూ మిథాలీ నిలిచింది. ట్విట్టర్‌లో మిథాలీకి 2 లక్షల 20 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు.