ఒక్క ఇన్‌స్టాగ్రామ్ పోస్టుకు 1.35కోట్లు తీసుకుంటున్న విరాట్ కోహ్లీ

సాధారణ ఆటగాడిగా కెరీర్ కొనసాగించిన విరాట్ కోహ్లీ అంచలంచెలుగా ఎదిగి ప్రస్తుతం టీమిండియాకు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. కోహ్లీ బ్యాటింగ్‌కు దిగితే మైదానంలో పరుగుల వరద పారాల్సిందే. లక్ష్య ఛేదనలో కూడా ఎలాంటి తడబాటు లేకుండా జట్టుకు విజయాలు అందిస్తాడు. కెరీర్ ఆరంభం నుండి అద్భుత ఫామ్‌లో ఉన్న కోహ్లీ ఎన్నో రికార్డులు తన పేరున లికించుకున్నాడు. ప్రస్తుతం వన్డే, టెస్ట్ ఫార్మాట్‌లలో నంబర్ వన్ బ్యాట్స్‌మన్. దీంతో పలు వ్యాపార సంస్థలు కోహ్లీని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్నాయి.
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7 ప్రత్యేక వార్తల కోసం

ఒక్క పోస్టుకు 1.35కోట్లు:
ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఎన్నో వ్యాపార సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. ఇక కోహ్లీకి సోషల్ మీడియాలోనూ చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీని 38.1 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. బ్రాండ్ అంబాసిడర్‌గా సంస్థల ఉత్పత్తులకు సంబంధించి కోహ్లీ ఇన్‌స్టాలో పోస్టులు చేస్తుంటాడు. దీనికి భారీ మొత్తం వసూలు చేస్తాడు. ఒక్క ఇన్‌స్టా పోస్ట్‌కు కోహ్లీ 1.35కోట్లు తీసుకుంటాడు. దీంతో వ్యాపార ప్రకటన ద్వారా అత్యధికంగా ఆర్జించే ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ నిలిచాడు.

ఒకే ఒక్క క్రికెటర్:
తాజాగా హోపర్‌హెచ్‌క్యూ అనే ఇన్‌స్టాగ్రామ్ షెడ్యూలింగ్ టూల్ విడుదల చేసిన జాబితాలో కోహ్లీ ప్రపంచ వ్యాప్తంగా తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఇన్‌స్టా పోస్టులతో అత్యధికంగా సంపాదిస్తున్న ఒకే ఒక్క క్రికెటర్ విరాట్ కోహ్లీనే కావడం గమనార్హం. టాప్-10 జాబితాలో మరే క్రికెటర్ కూడా చోటు దక్కించుకోలేదు. పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో ప్రకటన ద్వారా అత్యధికంగా ఆర్జించే ఆటగాళ్ల జాబితాలో తొలి స్థానంలో ఉన్నాడు. రొనాల్డో ఒక్కో పోస్ట్‌కు రూ.6.73కోట్లు తీసుకుంటున్నాడు.

తొలి స్థానంలో రొనాల్డో:
ఒక్కో పోస్ట్‌కు నెయ్‌మార్ రూ.4.98కోట్లు తీసుకుంటూ రెండో స్థానంలో నిలిచాడు. లియోనల్ మెస్పీ రూ.4.47కోట్లు, డేవిడ్ బెకారమ్ రూ.2.46కోట్లు, లిబ్రాన్ జేమ్స్ రూ.1.88కోట్లు, రొనాల్డినో రూ.1.76కోట్లు, గారెట్ బాలే రూ.1.50కోట్లు, లాటన్ ఇబ్రహిమోవిక్ రూ.1.38కోట్లు, లూయిస్ సారేజ్ రూ.1.27 కోట్లు తీసుకుంటూ వరుసగా ఉన్నారు. 15 స్థానంలో అమెరికా రెజ్లర్ రోజర్ రౌసీ, 16 స్థానంలో టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్‌లు ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications