వికెట్ తీశాడు.. మాస్క్ పెట్టుకున్నాడు! పాక్ బౌలర్ వినూత్న సంబురం

బిగ్‌బాష లీగ్ 2021-2022లో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. మెల్‌బోర్న్ స్టార్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ హరీస్ రౌఫ్ వికెట్ తీసిన అనంతరం తన సంబరాలను వినూత్నంగా జరుపుకున్నాడు. ఆ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పెర్త్ స్కాచర్స్ తొలి రెండు ఓవర్లలోనే 21 పరుగులు సాధించింది. ఈ క్రమంలో బౌలింగ్‌కు వచ్చిన హరీస్ రౌఫ్ మూడో ఓవర్‌లో 5 బంతుల్లోనే 8 పరుగులు చేసిన పీటర్సన్‌ను ఔట్ చేశాడు. రౌఫ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ జో క్లార్క్ షార్ప్‌కు క్యాచ్ ఇచ్చి పీటర్సన్ వెనుదిరిగాడు. ఆ సమయంలో వికెట్ తీసిన సంబరాలను హరీస్ రౌఫ్ వినూత్నంగా జరుపుకున్నాడు.
కరోనా జాగ్రత్తలు తెలియచేస్తూ..
కరోనా మహమ్మారి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియ చేస్తూ వికెట్ తీసిన వెంటనే రౌఫ్ గ్రౌండ్‌లోనే తన చేతులకు శానిటైజర్ రుద్దుకున్నాడు. అలాగే మాస్క్ కూడా ధరించాడు. దీంతో రౌఫ్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. మెల్‌బోర్న్ స్టార్స్ కెప్టెన్ మాక్స్‌వెల్‌తో సహా అభిమానులు కురిపిస్తున్నారు. అంతేకాకుండా బిగ్‌బాష్ లీగ్ మేనేజ్‌మెంట్ ట్విటర్‌లో ఈ వీడియోను షేర్ చేయగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రౌఫ్ కంటే ముందు దక్షిణాఫ్రికా స్పిన్నర్ తబ్రైజ్ షమ్సీ కూడా ఇలాగే సంబరాలు చేసుకున్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో మొత్తంగా 4 ఓవర్లు బౌలింగ్ చేసిన రౌఫ్ 38 పరుగులిచ్చి 2 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
వరల్డ్‌కప్‌లో రాణించాడు
2019లో పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో లాహోర్ ఖలాండర్స్ తరపున హరీస్ రౌఫ్ ఆకట్టుకున్నాడు. తద్వారా క్రికెట్ ప్రపంచంలో పేరు తెచ్చుకున్నాడు. అనంతరం పాకిస్థాన్ తరఫున ఆడాడు. ఇటీవల యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో రాణించాడు. పాక్ సెమీఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. లీగ్ స్టేజ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఇప్పటివరకు తన అంతర్జాతీయ కెరీర్‌లో 34 టీ20 మ్యాచ్‌లు ఆడి 41 వికెట్లు, 8 వన్డే మ్యాచ్‌లు ఆడి 14 వికెట్లు తీశాడు.

పెర్త్ స్కాచర్స్ విజయం
కాగా ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పెర్త్ స్కాచర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ జట్టు బ్యాటర్లలో ఎవాన్స్(69),టర్నర్(47), నిక్ హాబ్సన్(46) రాణించారు.
అనంతరం 197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మెల్‌బోర్న్ నిర్ణీత 20 ఓవర్లలో 149 పరుగులు మాత్రమే చేసింది. దీంతో పెర్త్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications