కోహ్లిని ఎలా ఔట్ చేయాలి: అదే కలిసొచ్చిందన్న జాదవ్
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి బ్యాటింగ్‌కు దిగడం తనకు ఎంతో కలిసొచ్చిందని కేదార్ జాదవ్ అన్నాడు. ఇంగ్లాండ్‌తో ఆదివారం జరిగిన తొలి వన్డేలో ఇంగ్లాండ్ బౌలర్లందరూ కోహ్లిని లక్ష్యంగా చేసుకోవడంతో తాను సెంచరీ సాధించడం సులభమైందని అన్నాడు.
'కోహ్లీ క్రీజులో ఉన్నంత సేపు ప్రత్యర్థి బౌలర్లకు అతడే టార్గెట్. కోహ్లినే లక్ష్యంగా చేసుకుని వారి ఎత్తులు ఉంటాయి. అతన్ని ఎలా ఔట్ చేయాలి, ఆ దూకుడును ఎలా అడ్డుకోవాలనే దానిపై దృష్టి సారిస్తారు. ఈ సమయంలో రెండో ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్‌ను పెద్దగా పట్టించుకోరు. దీంతో కొన్ని గతి తప్పిన బంతులు వస్తుంటాయి. అప్పుడు పరుగులు చేయడం సులభతరం అవుతుంది' అని కేదార్ జాదవ్ అన్నాడు.

పుణె వన్డేలోనూ అలాగే జరిగింది
పుణె వన్డేలోనూ అలాగే జరిగిందని చెప్పాడు. కోహ్లీని లక్ష్యంగా చేసుకున్న బౌలర్లు నన్ను తేలికగా తీసుకున్నారు. ఇదే వారి కొంపముంచింది. చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ పరుగులు రాబట్టాను అని చెప్పాడు. ఇంగ్లండ్ నిర్దేశించిన 351 పరుగుల భారీ లక్ష్యాన్ని కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఏడు వికెట్లు కోల్పోయి మరో 11 బంతులు మిగిలుండగానే ఛేదించింది.

ఐదో వికెట్‌కు 200కు పైగా పరుగులు
63 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను కోహ్లీ-జాదవ్‌ల జోడీ ఆదుకుంది. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 200కు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. స్ధానిక ఆటగాడైన కేదార్ జాదవ్ చెలరేగి ఆడుతుంటే కోహ్లీ అతడికి మద్దతు తెలుపుతూ మైమరచిపోయాడు. మ్యాచ్ అనంతరం జాదవ్ ఇన్నింగ్స్‌ను కెప్టెన్ కోహ్లీ ఎంతో ప్రశంసించాడు.

ప్రతీ మ్యాచ్‌ను చివరిదిగానే భావిస్తాను
‘నేను ఆడే ప్రతీ మ్యాచ్‌ను చివరిదిగానే భావిస్తాను. దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నప్పుడు అత్యుత్తమ స్థాయిలో రాణించాలని కోరుకుంటాను. అంతకంటే ఎక్కువగానే ఇస్తాన' అని జాదవ్ చెప్పాడు. రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియా పర్యటనలో గాయంతో బాధపడుతున్నా భారత ఏ జట్టు తరఫున ఆడిన ఇన్నింగ్స్ తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని జాదవ్ అన్నాడు.

టెన్నిస్ బాల్‌తో స్ట్రయిట్ సిక్సర్లు ఆడే టోర్నీలు ఆడా
గతంలో టెన్నిస్ బాల్‌తో స్ట్రయిట్ సిక్సర్లు మాత్రమే ఆడే టోర్నీలు ఆడానని ఆ అనుభవం ఈ మ్యాచ్‌లో పనికొచ్చిందని కేదార్ చెప్పాడు. క్లిష్టపరిస్థితులను తాను అవకాశంగా మలుచుకున్నానని చెప్పాడు. అయితే ఒక్క ఇన్నింగ్స్‌తో రాత్రికి రాత్రే స్టార్‌గా ఎదిగినా తాను వాస్తవంలోనే బతకాలనుకుంటున్నట్టు కేదార్ చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications