For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫేసర్ జహీర్ కెరియర్ చివరి దశకు చేరిందా..?

By Nageswara Rao
Zaheer Khan
టీమిండియా ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించడానికి ఇండియా పేస్ బౌలర్ జహీర్ ఖాన్ అందించిన సేవలు ప్రశంసనీయం. జహీర్ ఖాన్ లేకపోతే ప్రపంచ కప్ 2011ని సాధించలేకపోయే వారిమే అన్నవారు కూడా ఉన్నవారున్నారు. అత్యుత్తమమైన సేవలను అందించిన టీమిండియా ఫేసర్ జహీర్ ఖాన్ గురించి ఇటీవల కాలంలో కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి. ఆ ఊహాగానాలు ప్రకారం భారత జట్టుకు పేస్ బౌలర్‌గా జహీర్ ఖాన్ ఇకపై ఎంతోకాలం తన సేవలు అందించలేడా? అతని కెరీర్ ప్రమాదంలో పడిందా? ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే ఈ పశ్నలకు అవుననే సమాధానం చెప్పాలి.

ప్రస్తుతం జహీర్ ఖాన్ ఉన్న పరిస్దితులలో ఇండియా టీమ్‌కి అత్యుత్తమ సేవలు అందించే లేని స్థితిలో ఉన్నాడు. తరచుగాయాలతో బాధపడుతున్న అతను మళ్లీ పూర్వ వైభవాన్నిఅందుకోవడం, సాధారణంగా రాణించడం కష్టమేనని అంటున్నారు క్రికెట్ పండితులు. ఫాస్ట్ బౌలర్ల కెరీర్ చాలా తక్కువ. ఫిట్నెస్‌పై శ్రద్ధ తీసుకోకపోతే మరిన్ని కష్టాలు తలెత్తుతాయ. జహీర్ ఒక్క టెస్టు సిరీస్‌ను కూడా గాయాల బారిన పడకుండా పూర్తి చేయకపోవడమే అతని ఫిట్నెస్ సమస్యలకు అద్దం పడుతుంది. ఫాస్ట్ బౌలర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు జహీర్ తీసుకుంటున్నట్టు కని పించడం లేదని భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ గతంలో చేసిన వ్యాఖ్య లను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి.

క్రీడాకారులకు ఫిట్నెస్ సమస్య కొత్తదేమీ కాకపోయనా, తరచు గాయాలబారిన పడడం ఒక ఫాస్ట్ బౌల ర్ కెరీర్‌ను దారుణంగా దెబ్బతీస్తుంది. ఫిట్నెస్ అద్భుతంగా ఉన్నప్పుడే ఫేసర్లు రాణించగలుగుతారు. బంతుల్లో వేగం ఏమాత్రం తగ్గినా, బ్యాట్స్ మెన్‌ను నిలువరించే అవకాశం వారికి లభించదు. గతంలోనూ చాలా మంది ఫాస్ట్ బౌలర్లు ఫిట్నెస్ సమస్యతోనే అర్ధాంతరంగా కెరీర్‌ను ము గించారు. పాకిస్తాన్ స్టార్ షోయబ్ అక్తర్ కూడా ఇలాంటి సమస్యతోనే కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. కపిల్ దేవ్ వంటి అతి కొద్ది మంది మాత్రమే రిటైర్మెంట్ వరకూ ఫిట్నెస్ సమస్యలు లేకుండా నెట్టుకొచ్చారు. ఎప్పటిక ప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, ఫిట్నెస్‌ను కాపాడుకుంటూ ఉండకపోతే క్రీడాకారుల కెరీర్ ప్రమాదంలో పడుతుంది. ఇప్పుడు జహీర్ ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటూ క్రమం గా క్రికెట్‌కు దూరమవుతున్నాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+