Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప‌్ర‌పంచ‌క‌ప్ నుంచి విజ‌య్ శంక‌ర్ అవుట్‌..మ‌యాంక్ ఇన్‌!

ICC Cricket World Cup 2019 : Vijay Shanker Ruled Out Of World Cup 2019 Due To Injury || Oneindia
Injured Vijay Shankar Out of World Cup, Mayank Likely Replacement

లండ‌న్‌: ఏ ముహూర్తంలో ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌ను ఆడే జ‌ట్టును ప్ర‌క‌టించారో గానీ.. ఒక‌రి తరువాత ఒక‌రు అన్న‌ట్టుగా ఇంటిబాట ప‌డుతున్నారు టీమిండియా క్రికెట‌ర్లు. వ‌రుస‌గా గాయాల బారిన ప‌డుతున్నారు. ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్ ఆరంభంలో డాషింగ్ ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ గాయ‌ప‌డ్డాడు. వేలి గాయంతో మొత్తం టోర్న‌మెంట్ నుంచే వైదొల‌గిపోయాడు. ఆ త‌రువాతి వంతు భువ‌నేశ్వ‌ర్ కుమార్‌ది. కాలి కండ‌రాల్లో గాయం వ‌ల్ల రెండు మ్యాచ్‌ల‌కు దూరం అయ్యాడు. సుమారు రెండు వారాల త‌రువాత ఫిట్‌నెస్‌ను సాధించాడు. ఇప్పుడు మ‌రో ఆల్‌రౌండ‌ర్ గాయ‌ప‌డ్డాడు. టోర్న‌మెంట్‌కే దూరం అయ్యాడు. ఆ ఆల్‌రౌండ‌ర్ పేరు విజ‌య్ శంక‌ర్‌. విజ‌య్ శంక‌ర్ స్థానంలో మ‌యాంక్ అగ‌ర్వాల్‌ను జ‌ట్టులోకి తీసుకున్నారు.

ఆల్‌రౌండ‌ర్‌గా ఎంట్రీ..

ఆల్‌రౌండ‌ర్‌గా ఎంట్రీ..

నాలుగేళ్ల‌కోసారి జ‌రిగే ప్ర‌పంచ‌క‌ప్ క్రికెట్ టోర్న‌మెంట్‌లో ఆడాల‌నేది ఏ క్రికెట‌ర్ అయినా కోరుకుంటాడు. దీని కోసం అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తారు. సెలెక్ట‌ర్ల కంట్లో ప‌డ‌టానికి చెమ‌టోడ్చుతారు. అలాంటి అద్భుత అవ‌కాశాన్ని అనుకోకుండా, అనూహ్యం ద‌క్కించుకున్నాడు ఆల్ రౌండ‌ర్ విజ‌య్ శంక‌ర్‌. ఆల్ రౌండ‌ర్ అనే ఒకే ఒక్క కార‌ణంతో విజ‌య్ శంక‌ర్ కంటే సీనియ‌ర్ల‌యిన‌, అత‌ని కంటే బాగా రాణించిన వారిని కూడా ప‌క్కన పెట్టారు సెలెక్ట‌ర్లు. ప్ర‌పంచ‌క‌ప్ మెగా టోర్న‌మెంట్ కోసం ఎంపిక చేసిన జ‌ట్టులో విజ‌య్ శంక‌ర్‌కు అవ‌కాశం క‌ల్పించారు.

బూమ్రా యార్క‌ర్‌కు బ‌లి

బూమ్రా యార్క‌ర్‌కు బ‌లి

కార‌ణాలు ఏమైన‌ప్ప‌టికీ- ఇలాంటి సువ‌ర్ణాకాశాన్ని పోగొట్టుకున్నాడు విజ‌య్ శంక‌ర్‌. అటు బ్యాట్‌తో, ఇటు బంతితో రాణించే ఈ త‌మిళ‌నాడు ఆల్ రౌండ‌ర్‌కు దుర‌దృష్టం వెంటాడింది. ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్ నుంచి అర్ధాంత‌రంగా వైదొల‌గాడు. దీనికి కార‌ణం..అత‌ని మ‌డ‌మ‌ల్లో ఏర్ప‌డిన గాయం. ఈ గాయానికి కార‌ణం ఫాస్ట్ బౌల‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా కావ‌డం ఓ ర‌కంగా చెప్పాలంటే విషాద‌క‌ర‌మే. నెట్ ప్రాక్టీస్ సంద‌ర్భంగా జ‌స్‌ప్రీత్ బుమ్రా సుమారు 140 కిలోమీట‌ర్ల వేగంతో వేసిన ఓ యార్క‌ర్‌.. నేరుగా అత‌ని పాదాల‌ను తాకింది. దాని దెబ్బ‌కు అక్క‌డిక‌క్క‌డే కూల‌బ‌డిపోయాడు విజ‌య్ శంక‌ర్‌. కుంటుకుంటూ నెట్స్ నుంచి త‌న గదికి వెళ్లిపోయాడు. ఆఫ్ఘ‌నిస్తాన్‌తో మ్యాచ్‌కు మూడురోజుల ముందు చోటు చేసుకున్న ఉదంతం ఇది. ఆ త‌రువాత విజ‌య్ శంక‌ర్ ఈ గాయం నుంచి కోలుకున్న‌ప్ప‌టికీ.. అది తాత్కాలిక‌మే. మడ‌మ‌ల్లో గాయం, వాపుతో బాధ‌ప‌డుతూనే అత‌ను ఆఫ్ఘ‌నిస్తాన్‌తో మ్యాచ్‌లో ఆడాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేశాడు.

తాత్కాలిక ఉప‌శ‌మ‌న‌మే..

తాత్కాలిక ఉప‌శ‌మ‌న‌మే..

ఆ గాయం కొద్దిగా ఉప‌శ‌మించ‌డంతో విజ‌య్ శంక‌ర్‌ను అదే స్థానంలో వెస్టిండీస్‌తో మ్యాచ్‌లోనూ ఆడించారు. ఈ రెండు మ్యాచుల్లో కూడా అత‌ను ఆశించిన స్థాయిలో రాణించ‌లేక‌పోయాడ‌నే విష‌యం తెలిసిందే. వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో 19 బంతుల్లో మూడు ఫోర్ల‌తో 14 ప‌రుగుల చేశాడు. కీమ‌ర్ రోచ్ బౌలింగ్‌లో వికెట్ కీప‌ర్ షైహోప్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అంత‌కుముందు- ఆప్ఘ‌నిస్తాన్‌తో మ్యాచ్‌లో సైతం అత‌ను విఫ‌లం అయ్యాడు. 41 బంతుల్లో రెండు ఫోర్ల‌తో 29 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగాడు. మ‌డ‌మ‌ల్లో గాయం కార‌ణంగా ఈ రెండు మ్యాచుల్లోనూ విజ‌య్ శంక‌ర్ బౌలింగ్‌కు దూరంగా ఉన్నాడు.

ఆ రికార్డు మాత్రం అతనిదే..

ఆ రికార్డు మాత్రం అతనిదే..

ప్ర‌పంచ‌క‌ప్ మెగా ఈవెంట్ నుంచి విజ‌య్ శంక‌ర్ అర్ధాంత‌రంగా వైదొల‌గిన‌ప్ప‌టికీ.. అత్యంత అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇదొక్క‌టే అత‌నికి ఊర‌టనిచ్చే విష‌యం. ఈ నెల 16వ తేదీన మాంచెస్ట‌ర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో పాకిస్తాన్‌తో మ్యాచ్ సంద‌ర్భంగా భువ‌నేశ్వ‌ర్ కుమార్ కాలి కండ‌రాలు ప‌ట్టేయ‌డం వ‌ల్ల త‌ప్పుకొన్న విష‌యం తెలిసిందే. త‌న బౌలింగ్ కోటాను కూడా భువ‌నేశ్వ‌ర్ కుమార్ పూర్తి చేయ‌లేక‌పోయాడు. ఓవ‌ర్‌లో నాలుగు బంతులేసి, డ్రెస్సింగ్ రూమ్ బాట ప‌ట్టాడు భువి. ఆ మిగిలిన రెండు బంతుల‌ను వేసే క్ర‌మంలో- విజ‌య్ శంక‌ర్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో సంధించిన తొలి బంతికే వికెట్‌ను ప‌డ‌గొట్టాడు. పాకిస్తాన్ ఓపెన‌ర్ ఇమాముల్ హ‌క్‌ను ఎల్బీడ‌బ్ల్యూగా బ‌లిగొన్నాడు. ప్ర‌పంచ‌క‌ప్‌లో వేసిన తొలి బంతికే వికెట్‌ను తీసుకున్న మూడో బౌల‌ర్‌గా అవ‌త‌రించాడ‌త‌ను.

Story first published: Monday, July 1, 2019, 14:34 [IST]
Other articles published on Jul 1, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+