ఆసిస్ సిరీస్‌కు దూరం: రోహిత్ కెరీర్‌కు ఇది పెద్ద దెబ్బే
న్యూఢిల్లీ: గాయం కారణంగా టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ 12 వారాల పాటు క్రికెట్‌కు దూరం కానున్నాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో ముగిసిన వన్డే సిరిస్‌లో రోహిత్ శర్మ గాయం పాలైన సంగతి తెలిసిందే. ఈ కారణంగానే రోహిత్ శర్మ ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు.
అయితే తాజాగా తొడకు అయిన గాయానికి ఆపరేషన్ అవసరం అవుతుందని, దీని చికిత్స కోసం వచ్చే వారం రోహిత్ లండన్ వెళ్లి అక్కడ చికిత్స తీసుకుంటాడని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదే గనుక జరిగితే వచ్చే ఏడాది ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరగనున్న నాలుగు టెస్టుల సిరిస్‌కు కూడా అందుబాటులో ఉండటం కష్టమే.

రోహిత్ శర్మ తొడకు గాయం
న్యూజిలాండ్‌తో అక్టోబర్ 29న విశాఖ వేదికగా జరిగిన చివరి వన్డేలో రోహిత్ శర్మ తొడకు గాయమైంది. వైద్యులు సర్జరీ అవసరమని తేల్చితే రోహిత్ 10 నుంచి 12 వారాలు క్రికెట్‌కు దూరంగా ఉండాల్సి రావచ్చు. ప్రస్తుతం రోహిత్‌కు బీసీసీఐ మెడికల్ టీమ్ అన్ని సహాయసహకారాలు అందిస్తున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

భారత్-ఆస్ట్రేలియా టెస్టు సిరిస్‌కు దూరం
వచ్చే ఏడాది ఫిబ్రవరి 23న భారత్-ఆస్ట్రేలియాల మధ్య నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే తొడ గాయం కారణంగా ఇంగ్లాండ్‌తో పాటు ఆస్ట్రేలియా సిరిస్‌కు దూరమవడంపై ముంబైలోని బాంద్రాలో ఆడిడాస్ హోం కోర్టు స్టోరు ఓపెనింగ్‌కు వచ్చిన రోహిత్ శర్మ స్పందించాడు.

మూడు నుంచి మూడున్నర నెలలు క్రికెట్‌కు దూరం
‘ఎన్ని రోజులు క్రికెట్‌కు దూరంగా ఉంటానో తెలియదు. బీసీసీఐ మెడికల్ టీమ్ వైద్యులతో సంప్రదిస్తోంది. స్కాన్ నివేదికలను వైద్యులకు పంపాం. వారి అభిప్రాయం కోసం వేచి చూస్తున్నాం. సర్జరీ అవసరమా? లేదా? అనేది వైద్యులు చెప్పాలి. సర్జరీ అవసరమైతే మూడు నుంచి మూడున్నర నెలలు క్రికెట్‌కు దూరం కావచ్చు' అని రోహిత్ పేర్కొన్నాడు.

ఆటలో భాగమే కదా
ఇక గాయం విషయానికి వస్తే ఇలా అవడం దురదృష్టమే అయినా, ఇదంతా ఆటలో భాగమేనని, ఇలాంటి సవాళ్లను అధిగమిస్తూ ముందుకు వెళతానని రోహిత్ చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications