ఐపీఎల్ 2017: అశ్విన్, రాహుల్ దూరం, ఏమైంది?
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 10వ సీజన్‌లో పలువురి భారత స్టార్ ఆటగాళ్ల సేవలను ప్రాంఛైజీలు కోల్పోనున్నాయి. ఈ టెస్టు సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు ఓపెనర్లు కేఎల్ రాహుల్, మురళీ విజయ్ గాయాల కారణంగా ఏప్రిల్ 5 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 10వ సీజన్‌కు దూరమయ్యారు.
ఐపీఎల్‌లో అశ్విన్ పూణె రైజింగ్ సూపర్ జెయింట్ తరఫున ఆడుతుండగా, కేఎల్ రాహుల్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, మురళీ విజయ్ పంజాబ్ కింగ్స్ ఎలెవన్ తరుపున ఆడుతున్నారు. అశ్విన్ హెర్నియాతో బాధపడుతుంటే.. రాహుల్, విజయ్‌లను భుజం గాయాలు వేధిస్తున్నాయి. త్వరలో వీరిద్దరికీ శస్త్రచికిత్స జరగనుంది.

కేఎల్ రాహుల్ భుజానికి గాయం
ఆస్ట్రేలియాతో సిరిస్ సందర్భంగా తొలి టెస్టులో ఓపెనర్ కేఎల్ రాహుల్ ఎడమ భుజానికి గాయమైంది. దాని తీవ్రత ఎక్కువ కావడంతో శస్త్ర చికిత్స కోసం అతడు త్వరలోనే లండన్ వెళ్లనున్నట్టు సమాచారం. ‘నేను ఐపీఎల్‌లో ఆడటంలేదు. అధికారిక సమాచారాన్ని నా జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు వెల్లడిస్తుంది' అని రాహుల్ తెలిపాడు.

మురళీ విజయ్ కూడా దూరం
మరోవైపు ఇదే సిరిస్‌లో భుజం గాయంతో ఇబ్బంది పడిన విజయ్ కూడా త్వరలోనే శస్త్ర చికిత్స చేయించుకోనున్నాడు. ఈ సీజన్‌లో మురళీ విజయ్ కూడా ఆడటం అనుమానంగా మారింది. గత తొమ్మిది నెలలుగా విరామం లేకుండా జాతీయ జట్టుకు ఆడుతున్న రవీంద్ర జడేజా (గుజరాత్ లయన్స్), ఉమేశ్ యాదవ్ (కోల్‌కతా నైట్‌రైడర్స్) ఆరంభ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండరు.

ఛాంపియన్స్ ట్రోఫీకి ఫిట్‌నెస్ సాధిస్తారు
ఇదిలా ఉంటే ఐపీఎల్ 10వ సీజన్‌లో అశ్విన్ ఆడేది లేనిది పూణె యాజమాన్యం ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. కేఎల్ రాహుల్, అశ్విన్‌లు ఈ ఏడాది జూన్‌లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి ఫిట్‌నెస్ సాధిస్తారని టీమిండియా ఆశిస్తోంది. బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రహ్మాన్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఇంకా అనుమతివ్వలేదు.

కోలుకోని కోహ్లీ
దీంతో అతడు పాల్గొనేదీ అనుమానంగా మారింది. రాంచీ టెస్టులో భుజం గాయం కారణంగా ధర్మశాలలో జరిగిన చివరి టెస్టుకు దూరమైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లో ఆడే దానిపై స్పష్టతలేదు. కనీసం రెండు వారాలు అతను లీగ్‌కు అందుబాటులో ఉండడని భావిస్తున్నారు. ఇదే అభిమానులకు నిరాశ కలిగిస్తుంటే, తాజాగా కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, మురళీ విజయ్‌లు పూర్తిగా టోర్నీకే దూరమవ్వడం అభిమానులను నిరాశకు గురి చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications