India vs Zimbabwe: కాసేపు బాడీ ప్రెజెంట్.. మైండ్ అబ్సెంట్ పరిస్థితి అయిందన్న దీపక్ చాహర్..!

జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్ గెలిచిన అనంతరం భారత కెప్టెన్ కేఎల్ రాహుల్ మాట్లాడుతూ తన కమ్ బ్యాక్ గురించి.. అలాగే మ్యాచ్ ప్రదర్శన గురించి పలు అభిప్రాయాలు వెల్లడించాడు. 'మేము చాలా క్రికెట్ ఆడుతున్నాము కాబట్టి గాయాలు అందులో భాగమేనని గుర్తించాలి. ఇన్ని రోజులు క్రికెట్‌కు దూరంగా ఉండటం చాలా కష్టం. ఈ కష్టమైన సమయాన్ని నేను అనుభవించాను. బెంగళూరులో నేను, కుల్దీప్, దీపక్ చాహర్ కలిసి రికవరీ అవ్వడంతో పాటు ఫిట్ నెస్ పొందాము.
ఈ మ్యాచ్ విషయానికొస్తే స్వింగ్, సీమ్ కదలికలు బాగున్నాయి.. బౌలర్లు క్రమశిక్షణతో వికెట్లు తీయడం మంచి విషయం. చాలా రోజులత తర్వాత భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్‌కి తిరిగి రావడం గొప్పగా అన్పించింది. నాతో పాటు మరికొంతమందికి కూడా ఇది గొప్ప విషయం. ఒక జట్టుగా మేము మంచి ఫాంలో ఉన్నాం. అందరికీ తగినంత అవకాశాలు లభిస్తుండడం కూడా చాలా బాగుంది. ఏదేమైనా ఓ కెప్టెన్‌గా ప్లేయర్‌గా భారత్ తరఫున ఆడుతుండడం మంచి అనుభూతినిస్తుంది.

ఆరున్నర నెలల తర్వాత ఆడడం వల్ల..!
అలాగే చాలా రోజుల పాటు గాయంతో జట్టుకు దూరమైన దీపక్ చాహర్ ఈ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ప్రదర్శన కనబరిచి తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. అతను తన తొలి స్పెల్‌లో జింబాబ్వే టాపార్డర్‌ను కుప్పకూల్చాడు. చెప్పాలంటే మళ్లీ జట్టులో ల్యాండింగ్ కావడం కొంచెం కష్టమే. ఆరున్నర నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నప్పుడు.. సహజంగానే కొంచెం ఆందోళన చెందుతారు. నేను కూడా అలాగే ఫీలయ్యాయి.
అయితే ఇక్కడికి రాకున్న ముందే నేను కనీసం 4-5 ప్రాక్టీస్ గేమ్‌లు ఆడాను. మొదటి కొన్ని ఓవర్లలో బాడీ ప్రజెంట్, మైండ్ అబ్సెంట్ అనేలా బౌలింగ్ చేశా. అయితే రెండు మూడు ఓవర్ల తర్వాత లయ కుదిరింది. ఆ తర్వాత మళ్లీ పికప్ అయ్యాను. నేను ప్రస్తుతం శారీరకంగానూ, మానసికంగానూ చాలా బాగున్నాను.' దీపక్ చాహర్ పేర్కొన్నాడు.

మిగిలిన రెండు మ్యాచ్‌లు హరారే వేదికగా..
ఇక ఈ మ్యాచ్‌లో జింబాబ్వే 40.3ఓవర్లకు 189పరుగులకే ఆలౌట్ కాగా.. తర్వాత ధావన్ (81పరుగులు), శుభ్‌మన్ గిల్ (82పరుగులు) ఇద్దరే 30.5ఓవర్లలోనే లక్ష్యాన్ని అలవోకగా ఊది పడేశారు. తద్వారా 10వికెట్ల భారీ తేడాతో ఇండియా ఘన విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ సారథ్యంలో తొలిసారి భారత్ వన్డే గెలుపొందింది. తద్వారా సిరీస్లో భారత్ 1-0తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక మిగిలిన రెండు మ్యాచ్‌లు సైతం హరారే వేదికగా.. ఆగస్టు 20, 22 తేదీల్లో జరగనున్నాయి.

తుది జట్లు:
భారత్: శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్(కెప్టెన్), దీపక్ హుడా, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్
జింబాబ్వే: మరుమణి, ఇన్నోసెంట్ కాయ, సీన్ విలియమ్స్, వెస్లీ మధేవెరే, సికందర్ రజా, చకాబ్వా (కెప్టెన్, వికెట్ కీపర్), ర్యాన్ బర్ల్, లూక్ జాంగ్‌వి, బ్రాడ్ ఇవాన్స్, విక్టర్ ఎన్‌యౌచి, రిచార్డ్ ఎంగర్వా
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications