Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంగ్లాండ్‌ పర్యటనకు స్టార్ క్రికెట్ దూరం

Injured Ben Stokes left out of Englands T20 squad for India series

హైదరాబాద్: త్వరలో ఆస్ట్రేలియా, భారత్ జట్లకు ఇంగ్లాండ్‌ ఆతిథ్యం ఇవ్వనున్న తరుణంలో.. భారత్‌తో జూలై 3 నుంచి జరగనున్న మూడు టీ20ల సిరీస్‌కి ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ దూరమయ్యాడు. త్వరలో ఆస్ట్రేలియాతో జరగనున్న ఏకైక టీ20తో పాటు.. భారత్‌తో జరగనున్న టీ20 సిరీస్‌ కోసం ఇంగ్లాండ్ సెలక్టర్లు మంగళవారం జట్టుని ప్రకటించారు. గత ఏడాది మద్యం సేవించి ఒక వ్యక్తిని గాయపరిచిన కేసుతో దాదాపు మూడు నెలలు ఆటకి దూరమైన బెన్‌స్టోక్స్.. మళ్లీ గాయం కారణంగా జట్టులో స్థానం కోల్పోవడం శోచనీయం.

పాకిస్థాన్‌తో రెండో టెస్టు మ్యాచ్‌కు ముందు స్టార్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ తొడ కండరాలకు గాయమైన విషయం తెలిసిందే. తాజాగా బెన్‌స్టోక్స్ గాయం కారణంగా ఆసీస్, భారత్ జట్లతో టీ20 సిరీస్‌ల నుంచి తప్పుకున్నట్లు ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు మంగళవారం పేర్కొంది. అతని స్థానంలో.. ఆల్‌రౌండర్ శామ్ కుర్రాన్‌ని జట్టులోకి అవకాశమిచ్చారు.

అతని సోదరుడు టామ్ కుర్రాన్‌ కూడా ఈ టీ20 జట్టులోకి ఎంపికవడంతో.. 1999 తర్వాత మళ్లీ ఇంగ్లాండ్ తరఫున ఆడబోతున్న సోదరులుగా వీరు రికార్డు నెలకొల్పనున్నారు. ఫాస్ట్ బౌలర్ మార్క్‌వుడ్‌కి విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు.. జాక్‌ బాల్‌‌కి తిరిగి అవకాశమిచ్చారు. ఇంగ్లాండ్‌ జట్టు జూన్ 27న ఆస్ట్రేలియాతో ఏకైక టీ20 మ్యాచ్ ఆడనుంది.

ఇంగ్లాండ్ టీ20 జట్టు: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), మొయిన్ అలీ, జానీ బారిస్టో, జాక్ బాల్, జోస్ బట్లర్, టామ్ కుర్రాన్, శామ్ కుర్రాన్, అలెక్స్ హేల్స్, క్రిస్ జోర్దాన్, ఫ్లంకెట్, అదిల్ రషీద్, జో రూట్, జేసన్ రాయ్, డేవిడ్ విల్లీ

Story first published: Tuesday, June 19, 2018, 20:29 [IST]
Other articles published on Jun 19, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+