Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

న్యూజిలాండ్‌తో వన్డే: స్మిత్ దూరం, వేడ్‌ను ఎంపిక సీఏ

హైదరాబాద్: ఫిబ్రవరి 30 (సోమవారం) నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న వన్డే సిరిస్‌కు ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ దూరమయ్యాడు. ఐదు వన్డేల సిరిస్‌లో చివరిదైన అడిలైడ్‌ వన్డేలో పాకిస్థాన్‌తో మ్యాచ్ సందర్భంగా స్టీవ్ స్మిత్ ఎడమ చీలమండకు గాయమైంది.

దీంతో న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరిస్‌కు స్టీవ్ స్మిత్ దూరం కానున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ విషయంపై క్రికెట్ ఆస్ట్రేలియా మెడిసన్ మేనేజర్ మాట్లాడుతూ స్మిత్ గాయం తీవ్రత కాస్త ఎక్కువగా ఉండటంతో అతనికి దాదాపు పది రోజులుకు పైగా విశ్రాంతి అవసరమని పేర్కొన్నారు.

Injured Australia Captain Steve Smith Out Of New Zealand Tour

తొలుత స్మిత్ గాయం నుంచి కోలుకోవడానికి వారం నుంచి పది రోజులు పడుతుందని క్రికెట్ ఆస్ట్రేలియా భావించింది. అయితే అలా జరగపోవడంతో న్యూజిలాండ్‌తో సోమవారం ప్రారంభం కానున్న వన్డే సిరిస్ నుంచి స్మిత్‌ వైదొలగినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది.

కివీస్ పర్యటన తర్వాత భారత పర్యటనకు ఆస్ట్రేలియా రానున్న నేపథ్యంలో స్మిత్‌కు తగినంత విశ్రాంతినిస్తే, తొందరగా కోలుకునే అవకాశం ఉందని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. సోమవారం నుంచి న్యూజిలాండ్‌తో ఆరంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌కు స్మిత్ స్థానంలో మాథ్యూ వేడ్‌ను ఎంపిక చేశారు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+