For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDW vs SLW T20 Series: చమరీ ఆటపట్టు భీకర ఇన్నింగ్స్.. మూడో టీ20లో శ్రీలంకదే విజయం, సిరీస్ మనదే

INDW vs SLW : Captain Chamari Athapaththu Heroic Innings helps to Lanka win in Last t20

శ్రీలంక వుమెన్స్ కెప్టెన్ చమరీ ఆటపట్టు (48బంతుల్లో 14ఫోర్లు, 1సిక్సర్ సహాయంతో 80పరుగులు నాటౌట్‌) దంచికొట్టడంతో ఇండియా వుమెన్స్ మీద టీ20 సిరీస్లోని చివరిది, మూడోదైన టీ20 మ్యాచ్‌లో 7వికెట్ల తేడాతో శ్రీలంక గెలుపొందింది. ఇక మరో 18 బంతులు మిగిలి ఉండగానే శ్రీలంక భారత్‌ను ఓడించింది. అనుభవజ్ఞురాలైన శ్రీలంక ఓపెనర్ ఆటపట్టును అడ్డుకోవడం భారత బౌలర్ల తరం కాలేదు. ఇకపోతే తొలి ఇన్నింగ్స్‌లో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (39పరుగులు 33బంతుల్లో 3ఫోర్లు 1సిక్సర్ నాటౌట్) రాణించడంతో నిర్ణీత 20ఓవర్లలో భారత్ 5వికెట్లు కోల్పోయి 138పరుగులు చేసింది. ఇక శ్రీలంక 17ఓవర్లలోనే 3వికెట్లు కోల్పోయి 141పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఇక భారత బ్యాటర్లలో జెమిమా రోడ్రిగ్స్ (33 పరుగులు 30బంతుల్లో 3ఫోర్లు) కూడా రాణించింది.

జెమీమా, హర్మన్ వికెట్ కాపాడుకుంటూ ఆడడంతో

జెమీమా, హర్మన్ వికెట్ కాపాడుకుంటూ ఆడడంతో

దంబుల్లాలో జరిగిన ఈ మ్యాచ్ విషయానికొస్తే.. ఇప్పటికే 2-0తో సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియాను శ్రీలంక చివరి మ్యాచ్‌లో ధాటిగా ఎదుర్కొంది. మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌ను శ్రీలంక బౌలర్లు తమ కట్టుదిట్టమైన బంతులతో తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. భారత డేరింగ్ అండ్ డ్యాషింగ్ ఓపెనర్ షఫాలీ వర్మ (5) ఆదిలోనే ఔటయింది. ఇక స్మృతి మంధాన, సబ్బినేని మేఘన తలా 22పరుగులు చేసి ఔటయిపోయారు. మూడు వికెట్లు కోల్పోవడంతో స్కోరు బోర్డు వేగం మందగించింది. ఇక వికెట్ కాపాడుకుంటూ ఆడిన హర్మన్ ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్ చివర్లో చెలరేగడంతో ఆ మాత్రం స్కోరునైనా చేయగలిగింది.

ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా హర్మన్ ప్రీత్ కౌర్

ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా హర్మన్ ప్రీత్ కౌర్

ఇక శ్రీలంక బౌలర్లలో ఆమా కాంచన, సుగంధిక కుమారి, రణసింగే, రణవీర తలా ఒక వికెట్ తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. విష్మీ గుణరత్నే (5), హర్షిత మాధవి (13) త్వరగానే ఓటయినప్పటికీ.. మూడో వికెట్‌కు నీలాక్సీ డిసిల్వా (30పరుగులు 28బంతుల్లో 4ఫోర్లు)తో కలిసి కెప్టెన్ చమారీ ఆటపట్టు 77పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. చివర్లో డిసిల్వా ఔటయినా.. ఓవర్లు భారీగా ఉండడంతో కవిశా దిల్హారి (7) అండగా ఆటపట్టు చెలరేగి మ్యాచ్‌ను 17ఓవర్లకే ముగించింది. దీంతో ఈ సిరీస్ 2-1తో ముగిసింది. ఇక సిరీస్ గెలిచిన అనంతరం హర్మన్ ప్రీత్ కౌర్ ట్రోఫీ అందుకుంది. ఇక ఈ సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నిలిచింది. ఇక మూడో మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా చమరీ ఆటపట్టు నిలిచింది.

తుది జట్లు:

తుది జట్లు:

భారత వుమెన్స్ టీం: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, సబ్బినేని మేఘన, హర్మన్‌ప్రీత్ కౌర్( కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, యాస్తికా భాటియా (వికెట్ కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, సిమ్రాన్ బహదూర్, రేణుకా సింగ్, రాధా యాదవ్.

శ్రీలంక వుమెన్స్ టీం: విష్మి గుణరత్నే, చమరి ఆటపట్టు (కెప్టెన్), హర్షిత మాదవి, కవిషా దిల్హరి, నీలాక్షి డి సిల్వా, అమ కాంచన, అనుష్క సంజీవని(వికెట్ కీపర్), ఓషాది రణసింగ్, సుగండిక కుమారి, మల్షా షెహాని, ఇనోకా రణవీర.

Story first published: Monday, June 27, 2022, 18:07 [IST]
Other articles published on Jun 27, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+