న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDW vs SLW 1st T20: జెమిమా రోడ్రిగ్స్ ఫినిషింగ్‌కు, భారత బౌలర్ల ఫనిషింగ్‌కు శ్రీలంక చిత్తు

INDW vs SLW 1st T20: Rodrigues Heroic Finishing, and Economic Bowling makes India win over Srilanka

శ్రీలంక వుమెన్స్ vs ఇండియా వుమెన్స్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా గురువారం దంబుల్లాలో జరిగిన మొదటి మ్యాచ్‌లో 34పరుగులతో తేడాతో భారత్ శ్రీలంకపై గెలుపొందింది. తద్వారా ఈ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వచ్చింది. ఇకపోతే తొలుత 138పరుగుల మోస్తరు స్కోరుకే టీమిండియా పరిమితమైనప్పటికీ.. భారత బౌలర్ల టఫ్ బౌలింగ్ వేసి ఆ స్కోరును డిఫెండ్ చేయగలిగారు. మొత్తం 8మంది బౌలింగ్ వేయడం విశేషం. బౌలింగ్లో రాధా యాదవ్ 2/22తో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. భారత తొలి ఇన్నింగ్స్లో జెమిమా రోడ్రిగ్స్ (27బంతుల్లో 36పరుగులు నాటౌట్) చివర్లో చెలరేగడంతో భారత్‌ను 6వికెట్లు కోల్పోయి 138పరుగులు చేయగలిగింది. తొలుత భారత బ్యాటర్ల ప్రదర్శన పూర్తిగా నిరాశపరిచింది. నాలుగో ఓవర్‌లో వరుస బంతుల్లో స్మృతి మంధాన, సబ్భినేని మేఘన ఔటవ్వడంతో స్కోరు వేగం మందగించింది.

పేసర్ ఓషది రణసింగ్ ఈ రెండు వికెట్లు తీసి భారత్‌ను ఆరంభంలోనే దెబ్బతీసింది. ఇక హర్మన్‌ప్రీత్ కౌర్, షఫాలీ వర్మ ఇన్నింగ్స్‌ను కాస్త గాడిలోకి తెచ్చారు. కెప్టెన్ చమరి అతపత్తు బౌలింగ్లో 31పరుగుల వద్ద షఫాలీ వర్మ ఔటయింది. భారత కెప్టెన్ హర్మన్ కూడా 22పరుగుల వద్ద ఎల్బీడబ్ల్యుగా దొరికిపోయింది. ఇక మరో బ్యాటర్ రిచా ఘోష్ 15 బంతుల్లో 11 పరుగులు, పూజా వస్త్రాకర్ 12 బంతుల్లో 14 పరుగులు మాత్రమే చేయడంతో స్కోరు బాగా నెమ్మదించింది. ఇక దీప్తి శర్మ 8బంతుల్లో 17 పరుగులతో చివరి వరకు క్రీజులో జెమీమాతో కలిసి నిలవడంతో భారత్ ప్రత్యర్థి ముందు కాపాడుకోగల లక్ష్యాన్ని ఉంచింది. ఇక ఛేదనకు దిగిన శ్రీలంక బ్యాటర్లలో దిల్హారీ (47పరుగులు) మినహా మిగతావాళ్లు రాణించలేదు. దీంతో ఆ జట్టు 5వికెట్లు కోల్పోయి 104పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక భారత బౌలర్లలో దీప్తి శర్మ 1, రాధాయాదవ్ 2, పూజా 1, సఫాలీ వర్మ 1 వికెట్ తీశారు.

తుది జట్లు

శ్రీలంక : చమరి అతపత్తు (కెప్టెన్), విష్మి గుణరత్నే, హర్షిత మాదవి, కవిషా దిల్హరి, నీలాక్షి డి సిల్వా, అనుష్క సంజీవని (wk), ఇనోకా రణవీర, అమ కాంచన, ఓషాది రణసింగ్, సుగండిక కుమారి, ఉదేశిక ప్రబోధని
ఇండియా : స్మృతి మంధాన, షఫాలీ వర్మ, సబ్బినేని మేఘన, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (wk), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రేణుకా సింగ్, రాధా యాదవ్, రాజేశ్వరి గయాక్వాడ్

Story first published: Thursday, June 23, 2022, 18:29 [IST]
Other articles published on Jun 23, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X