INDW vs SAW: నాలుగో టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ ఘనవిజయం.. టీ20 సిరీస్ కైవసం

సూరత్: సొంతగడపై దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత మహిళా జట్టు మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. సూరత్ వేదికగా మంగళవారం జరిగిన నాలుగో టీ20లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత్ 51 పరుగులతో ఘనవిజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో స్పిన్నర్ల విజృంభణతో విజయం సాధించిన భారత్.. నాలుగో టీ20లోనూ అదే మంత్రం ప్రయోగించి సక్సెస్ అయింది. ఆఫ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కించుకుంది.

మెరిసిన షఫాలీ:
వర్షం కారణంగా మైదానం చిత్తడిగా ఉండటంతో మ్యాచ్ నిర్ణీత సమయం కంటే అరగంట ఆలస్యంగా ప్రారంభమవడంతో 17 ఓవర్లకు కుదించారు. మొదట టాస్ ఓడి మొదటగా బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు 17 ఓవర్లలో 4 వికెట్లకు 140 పరుగులు చేసింది. భారత్‌కుమంచి శుభారంభం దక్కింది. అరంగేట్రం మ్యాచ్‌లో డకౌటై నిరాశపరిచిన షఫాలీ వర్మ (33 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) తన రెండో మ్యాచ్‌లో ఆకట్టుకుంది. బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. ఈ క్రమంలోనే స్మృతి మందన (13)తో కలిసి తొలి వికెట్‌కు 52 పరుగులు జోడించింది.

మంధాన విఫలం:
మరోవైపు మంధాన తనకు రెండు సార్లు లైఫ్ లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. షఫాలీ అర్ధ సెంచరీకి దగ్గరగా ఉండగా.. సెఖుఖునే క్లీన్‌బౌల్డ్ చేసింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ (16; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా తక్కువ స్కోరుకే వెనుదిరిగింది. ఆ తర్వాత దీప్తి శర్మ (20).. జెమీమాకు సహకారం అందించడంతో భారత్ మంచి స్కోరు చేసింది.

స్పీన్ దాటికి నిలవలేక:
లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 17 ఓవర్లలో 7 వికెట్లకు 89 పరుగులే చేయగలిగింది. ప్రొటీస్ స్పిన్ బలహీనతను భారత స్పిన్నర్లు ఉపయోగించుకున్నారు. ఆఫ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్ (3/13), లెగ్ స్పిన్నర్ రాధా యాదవ్ (2/16) దెబ్బకు ప్రొటీస్ బ్యాట్స్‌వుమెన్ క్రీజులో నిలబడలేకపోయారు. 23 పరుగుల చేసిన లారా వోల్వార్ట్‌నే టాప్ స్కోరర్. ఓపెనర్ బ్రిట్స్ (20) మినహా అందరూ సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరారు. దక్షిణాఫ్రికా ఏ దశలోనూ టార్గెట్ ఛేజ్ చేసేలా కనిపించలేదు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. నామమాత్రమైన చివర టీ20 శుక్రవారం జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications