Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsWI : తన ఫస్ట్ ఓవర్లోనే రెండు వికెట్లు తీసిన చాహల్.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ!

విండీస్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచులో భారత్‌కు యుజ్వేంద్ర చాహల్ బ్రేక్ ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్‌కు ఆ టీం ఓపెనర్ బ్రాండన్ కింగ్ (28) మంచి ఆరంభం అందించాడు. మరో ఓపెనర్ కైల్ మేయర్స్ (1)కు పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం కూడా రాలేదు.

ఇలాంటి సమయంలో ఐదో ఓవర్లో బంతి అందుకున్న హార్దిక్ పాండ్యా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తను వేసిన తొలి బంతికే కైల్ మేయర్స్‌ను పెవిలియన్ చేర్చాడు. చాహల్ వేసిన బంతిని సరిగా అంచనా వేయలేకపోయిన మేయర్స్.. బంతి మిస్ అయ్యాడు. అది అతని ప్యాడ్లను తాకడంతో టీమిండియా ఎల్బీడబ్ల్యూకు అప్పీల్ చేసింది.

Yuzvendra Chahal

అంపైర్లు అతన్ని అవుట్ ఇచ్చారు. దీంతో మేయర్స్ మైదానం వీడాడు. అయితే రిప్లేలో బంతి ఆఫ్‌స్టంప్‌ను మిస్ అవుతున్నట్లు కనిపించింది. ఆ తర్వాతి బంతికి కొత్త బ్యాటర్ సింగిల్ తీశాడు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు వచ్చిన బ్రాండన్ కింగ్‌ను కూడా చాహల్ తన బుట్టలో వేసుకున్నాడు. చాహల్ వేసిన బంతిని ఫ్రంట్ ఫుట్‌పై ఆడేందుక కింగ్ ప్రయత్నించాడు.

కానీ బ్యాటును మిస్ అయిన బంతి అతని ప్యాడ్లను తాకింది. మరోసారి టీమిండియా ఎల్బీడబ్ల్యూకు అప్పీల్ చేసింది. అంపైర్ అవుటిచ్చాడు. అంతకుముందు బ్యాటర్ విషయంలో పొరపాటు జరగడంతో.. అవతలి ఎండ్‌లో ఉన్న చార్లెస్‌తో మాట్లాడిన కింగ్ రివ్యూ కోరాడు. రివ్యూలో అది అవుటని తేలడంతో భారత జట్టు సంబరాలు చేసుకుంది. కింగ్ నిరాశగా మైదానం వీడాడు.

ఇలా తన తొలి ఓవర్లోనే చాహల్ రెండు వికెట్లు తీయడంతో ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు. వన్డేల్లో చాహల్‌ను ఆడించకపోవడంపై ఇప్పటికే నిరాశగా ఉన్న ఫ్యాన్స్‌కు చాహల్ మంచి బ్రేక్ ఇచ్చాడంటూ కామెంట్స్ చేస్తున్నాడు. ఇలా చాహల్ చెలరేగినా కూడా.. విండీస్ బ్యాటర్లు కూడా రాణించడంతో ఈ టీం పవర్ ప్లే ముగిసే సరికి 54/2 స్కోరు చేసింది.

Story first published: Thursday, August 3, 2023, 21:00 [IST]
Other articles published on Aug 3, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+