టీ20 సిరీసులో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే విండీస్ చేతిలో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన భారత జట్టు.. మూడో మ్యాచ్ కూడా ఓడితే.. సిరీస్ చేజారడం ఖాయం. ఈ క్రమంలో మూడో మ్యాచ్‌లో కఠిన నిర్ణయాలు తప్పవని మాజీలు ఇప్పటికే చెప్పేశారు.
ఇప్పుడు టీమిండియా కూడా నిపుణులు సూచించిన మార్పునే చేసింది. తొలి రెండు టీ20ల్లో తేలిపోయిన వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను పక్కన పెట్టేసింది. అతని స్థానంలో మంచి ఫామ్‌లో ఉన్న యశస్వి జైస్వాల్‌ను ఆడించాలని నిర్ణయం తీసుకుంది. గుయానా వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో జైస్వాల్ టీ20 అరంగేట్రం చేస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తేనే సిరీస్ సజీవంగా ఉంటుంది. లేదంటే వరుస విజయాలతో విండీస్ ఈ సిరీసును తమ ఖాతాలో వేసుకుంటుంది.

ఈ క్రమంలోనే భారత జట్టు తమ టీంలో రెండు కీలక మార్పులు చేసింది. రెండో మ్యాచ్‌లో తేలిపోయిన రవి బిష్ణోయి స్థానంలో కుల్దీప్ యాదవ్‌ను తిరిగి జట్టులోకి తీసుకుంది. అలా కిషన్‌ను పక్కన పెట్టి ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్‌ను ఆడిస్తున్నట్లు హార్దిక్ పాండ్యా వెల్లడించాడు. విండీస్ కూడా తమ టీంలో ఒక మార్పు చేసింది.
తొలి మ్యాచ్‌లో రాణించి, రెండో మ్యాచ్‌లో తేలిపోయిన జేసన్ హోల్డర్‌ను పక్కన పెట్టేసింది. హోల్డర్2కు చిన్న గాయమైందని, అందుకే అతను ఆడటం లేదని విండీస్ సారధి రావ్‌మెన్ పావెల్ స్పష్టం చేశాడు. కిషన్‌ను ఎందుకు పక్కన పెట్టిందీ కారణం మాత్రం హార్దిక్ చెప్పలేదు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన విండీస్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.
వెస్టిండీస్ టీం: బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, జాన్సన్ చార్లెమస్, నికోలస్ పూరన్, రావ్‌మెన్ పావెల్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, రొమేరియో షెఫర్డ్, రాస్టన్ ఛేజ్, అకీల్ హొస్సేన్, అల్జారీ జోసెఫ్, ఓబెడ్ మెకాయ్
టీమిండియా: యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సంజూ శాంసన్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్